Air India: ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కలేదా.. ఇదే సూపర్ ఛాన్స్.. రూ.1,199కే ఆకాశయానం..
ABN , Publish Date - May 23 , 2025 | 02:48 PM
Air India Flight Ticket Offer: జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనేది మీ కలా.. అయితే, మీ కోరిక తీరేందుకు ఇదే మంచి ఛాన్స్.. వెంటనే ఎయిరిండియా లాంచ్ చేసిన మెగా సేల్‌లో టికెట్ బుక్ చేసుకోండి. బస్సు లేదా రైలు టికెట్‌కు అయ్యే ఖర్చుతోనే ఫ్లైట్ ఎక్కేయండి. డిసెంబర్ 10, 2025 వరకూ దేశవిదేశాల్లో ఎక్కడికైనా అతితక్కువఖర్చుతోనే విమాన ప్రయాణం చేసే అవకాశం మిస్సవకండి.
Air India Mega Sale Flight Ticket Offer: సామాన్యులు విమానం ఎక్కడాన్ని ఒక కలగానే భావిస్తారు. కానీ, ఇప్పుడది అసాధ్యమేమీ కాదు. బస్సు లేదా రైలు ప్రయాణాలకు అయ్యే ఖర్చుతోనే విమానం ఎక్కేయచ్చు. ఎందుకంటే ఎయిరిండియా (Air India ) మరోసారి ప్రయాణీకుల కోసం స్పెషల్ సేల్ ఆఫర్ లాంచ్ చేసింది. కేవలం రూ.1,199 తోనే దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణం చేయవచ్చు. ఎయిరిండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా స్పెషల్ సేల్ కింద టికెట్లు బుక్ చేసుకోవాలి. డిసెంబర్ 10, 2025 వరకూ దేశవిదేశీ ప్రయాణాల కోసం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, మే 23, 2025 రాత్రి 11:59 గంటల వరకే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఎయిర్ ఇండియా లాంచ్ చేసిన లిమిటెట్ టికెట్ సేల్ ఆఫర్ మే 23, 2025 వరకే అందుబాటులో ఉంటుంది. ఈ స్పెషల్ సేల్ కింద దేశవిదేశీ ప్రయాణాల కోసం ప్రయాణీకులు అతి తక్కువ ఖర్చుతోనే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. వన్-వే దేశీయ టిక్కెట్లను ప్రయాణికులు ఇప్పుడు కేవలం రూ.1,199 నుంచి బుక్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ రౌండ్-ట్రిప్ ఛార్జీలు రూ.11,969 నుంచి ప్రారంభమవుతాయి. గతంలో సెప్టెంబర్ 30, 2025 వరకూ ఉన్న ట్రావెల్ విండో డిసెంబర్ 10, 2025 వరకూ పొడిగించబడింది. ఉత్తర అమెరికా, యూరప్ (UKతో సహా), ఆస్ట్రేలియా వంటి ఎంపిక చేసిన సుదూర అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణీకులు టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ఎక్కువ డబ్బు ఆదా కావాలంటే..
ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో నేరుగా బుక్ చేసుకునే కస్టమర్లకు సౌలభ్య రుసుములు ఉండవు. FLYAI ప్రోమో కోడ్‌ని ఉపయోగిస్తే ఒక్కో ప్రయాణీకుడి రూ.3,000 వరకు అదనంగా డబ్బు ఆదా అవుతుంది. UPI లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలని ఎంచుకునే వారు వరుసగా UPIPROMO, NBPROMO కోడ్‌లను ఉపయోగించి రూ.2,500 వరకు అదనపు తగ్గింపులను పొందవచ్చు.
డిస్కౌంట్ యాడ్-ఆన్
ఎయిర్ ఇండియా ప్రీపెయిడ్ బ్యాగేజీపై (నాన్-స్టాప్ విమానాలకు) 40%, సీటు ఎంపికపై 20% వరకు తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ ట్రా లెగ్‌రూమ్ సీట్లు, ప్రాధాన్యతతో కలిపి ఈ ఆఫర్ ఉంటుంది. ఈ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, యాప్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని వలన ప్రయాణీకులు సరసమైన ధరలకే ప్రయాణించేలా ప్లాన్ చేసుకోవచ్చు.
ఈ కార్డులపై స్పెషల్ బ్యాంక్ ఆఫర్స్
ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్, ఫస్ట్ వంటి అన్ని క్లాసులకు వర్తించే రౌండ్-ట్రిప్ బుకింగ్‌లపై రూ. 8,000 వరకు తక్షణ తగ్గింపు అందించడానికి ఎయిర్ ఇండియా HSBC బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆఫర్ ఎయిర్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చేసే బుకింగ్‌లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అదే విధంగా టికెట్ల లభ్యత, ఫస్ట్ ఇన్ ఫస్ట్ సేల్ విధానంలో టికెట్లు కేటాయిస్తున్నారు. మారకం రేట్లు, ఇతరత్రా పన్నుల కారణంగా కొన్ని నగరాలకు టికెట్ల ధరలు కొద్దిగా మారవచ్చు.
మరిన్ని వివరాలకు, బుకింగ్ కోసం www.airindia.com సందర్శించండి:
ముఖ్యమైన విషయాలు
దేశీయ ఛార్జీలు రూ.1,199 నుంచి ప్రారంభం
అంతర్జాతీయ రౌండ్ ట్రిప్పులు రూ. 11,969 నుంచి మొదలవుతాయి.
డైరెక్ట్ బుకింగ్‌లపై జీరో కన్వీనియన్స్ ఫీజు
సెప్టెంబర్ 30, 2025 వరకు ప్రయాణం చేయవచ్చు (ఎంపిక చేసిన మార్గాలకు డిసెంబర్ 10,2025 వరకూ)
ప్రోమో కోడ్‌లు, HSBC కార్డుల ద్వారా అదనపు తగ్గింపులు
అమ్మకం ముగింపు తేదీ - 25 మే 2025
ఎలా బుక్ చేసుకోవాలి?
ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, ఎయిర్ ఇండియా మొబైల్ యాప్, ఎయిర్‌పోర్టు టికెట్ కార్యాలయాలు (ATOలు), కస్టమర్ కాంటాక్ట్ సెంటర్, ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్లు ద్వారా ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఇవీ చదవండి:
బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
సరికొత్త రికార్డు స్థాయికి బిట్‌కాయిన్ ధర.. ఎంతకు చేరిందో తెలుసా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి