Indians Lose Gaming Money: గేమింగ్ పేరుతో భారీ నష్టం.. ఏడాదిలో రూ.20 వేల కోట్లు నష్టపోయిన 45 కోట్ల ఇండియన్స్
ABN , Publish Date - Aug 25 , 2025 | 01:22 PM
మన దేశంలో ఆన్‌లైన్ గేమింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇదే సమయంలో గేమింగ్ గురించి షాకింగ్ నివేదిక వెలుగులోకి వచ్చింది. అది ఏంటంటే దాదాపు 45 కోట్ల మంది భారతీయులు ఏటా రూ.20 లక్షల కోట్లు రియల్ మనీ గేమ్స్ ద్వారా పోగొట్టుకుంటున్నారని ప్రభుత్వం అంచనా వేసింది.
గేమ్ ఆడితే టైమ్ పాస్ అవుతుందని చాలా మంది యువత రియల్ మనీ గేమ్స్ ఆడారు. కానీ ఇది కేవలం ఆట మాత్రమే కాదని, వాస్తవంగా ఇదొక ఫైనాన్షియల్ ట్రాప్ అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల గవర్నమెంట్ అంచనాల ప్రకారం, దేశంలో దాదాపు 45 కోట్ల మంది భారతీయులు రియల్ మనీ గేమింగ్ ద్వారా ఏడాదికి రూ.20 వేల కోట్లు నష్టపోయారు. ఈ భారీ నష్టాలు వాటి వెనక ఉన్న విషాద కథలు చూసిన ప్రభుత్వం చర్యలు (Indians Lose Gaming Money) తీసుకుంది.
2025లో ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ చట్టంగా మారింది. ఈ చట్టం హానికరమైన రియల్-మనీ గేమ్స్‌ను నిషేధిస్తూ, ఇ-స్పోర్ట్స్, విద్య పరమైన గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహిస్తోంది. లక్ష్యం ఏంటంటే, కుటుంబాలను ఆర్థిక సంక్షోభం, బానిసత్వం నుంచి కాపాడడం, అదే సమయంలో గేమింగ్ రంగంలో ఉద్యోగాలు, పెట్టుబడులు, గ్లోబల్ ఇ-స్పోర్ట్స్ మ్యాప్‌లో భారత్‌ను నిలబెట్టడం.
సంక్షోభం ఎంత పెద్దది?
ఈ గేమింగ్ నష్టాల వెనక యువత అప్పుల్లో కూరుకుపోవడం, కుటుంబాలు నాశనం కావడం, కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా జరిగాయి. కర్ణాటకలో గత మూడేళ్లలో 18 మంది ఆన్‌లైన్ మనీ గేమ్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. మైసూరులో ఒక కుటుంబం రూ.80 లక్షలు పోగొట్టుకుని ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ముంబై, హైదరాబాద్‌లలోనూ ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. ఈ సమస్య ఎంత విస్తృతంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఒక వరం కూడా..
అయితే, గేమింగ్ రంగంలో అంతా చెడు కాదు. ఇ-స్పోర్ట్స్ ఒక అద్భుతమైన అవకాశంగా మారుతోంది. ఇప్పటికే ఈ రంగం 1.5 లక్షల డైరెక్ట్ ఉద్యోగాలను సృష్టించింది. 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా. ప్రతి డైరెక్ట్ ఉద్యోగానికి, లాజిస్టిక్స్, కంటెంట్, ఎనలిటిక్స్‌లో మరో రెండు మూడు ఉద్యోగాలు వస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దాదాపు 40% గేమర్స్ టైర్-2, టైర్-3 నగరాల నుంచి వస్తున్నారు. అంటే, గేమింగ్ అవకాశాలు మెట్రోలకు మాత్రమే పరిమితం కాకుండా, చిన్న పట్టణాలకూ విస్తరిస్తున్నాయి.
కొత్త చట్టం ఏం చేస్తుంది?
ఈ కొత్త చట్టం గ్యాంబ్లింగ్ రకం మనీ గేమ్స్‌ను, నిజమైన స్కిల్-బేస్డ్ ఇ-స్పోర్ట్స్‌ను స్పష్టంగా వేరు చేస్తుంది. ఈ చట్టం రూపొందించడానికి ప్రభుత్వం మంత్రిత్వ శాఖలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, బ్యాంకులు, తల్లిదండ్రులు, గేమింగ్ ఇండస్ట్రీతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపింది. ఈ చట్టం హానికరమైన గేమ్స్‌ను నియంత్రిస్తూ, నిజమైన గేమింగ్ ఔత్సాహికులకు మద్దతు ఇస్తుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది భారత్‌లోని టాప్ గేమర్స్‌ను కలిసినప్పుడు, ఈ రంగం ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. ఇలాంటి నేపథ్యంలో మీరు ఇప్పుడు గేమ్ ఆడుతున్నారా? అయితే ఇప్పుడు కచ్చితంగా ఆలోచించండి. మీరు ఏ గేమ్ ఆడటం వల్ల మీకు ఫన్ ఇస్తుందా లేక డబ్బు పోతుందా అనేది ఆలోచించండి.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి