Job Success Story: 23 ఏళ్లకే రూ.3.6 కోట్లు జాబ్ ఆఫర్ పొందిన మనోజ్ తూము..కెరీర్ సీక్రెట్స్
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:38 PM
ప్రతి టెక్ ఉద్యోగికి కూడా మంచి కంపెనీలో భారీ ప్యాకేజీ జాబ్ కొట్టాలని ఉంటుంది. అలాంటి అరుదైన అవకాశాన్ని భారతీయ సంతతి అమెరికన్ మనోజ్ తూము 23 ఏళ్లకే సొంతం చేసుకున్నాడు. ఏడాదికి రూ.3.6 కోట్ల అత్యధిక ప్యాకేజీతో సత్తా చాటాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రతి టెకీ కూడా అంతర్జాతీయ సంస్థలలో జాబ్ రావాలని కోరుకుంటారు. అలాంటి అరుదైన అవకాశం భారత సంతతికి చెందిన అమెరికన్ మనోజ్ తూముకు 23 ఏళ్లకే వరించింది. అది కూడా ఏడాదికి రూ.3.6 కోట్ల ప్యాకేజీ. చిన్నగా మొదలైన అతని ప్రయాణం..ప్రస్తుతం మేటాలో ఉద్యోగం వచ్చేలా చేసింది. 23 ఏళ్ల వయసులోనే రూ.3.6 కోట్ల శాలరీతో Machine Learning Software Engineerగా Metaలో జాబ్ కొట్టిన మను ఇప్పుడు అనేక మందికి ఇన్‌స్పిరేషన్ అయిపోయాడు. అసలు ఈ ప్రయాణం ఎలా జరిగింది? ఎక్కడ నుంచి మొదలైంది? ఏం సలహాలు ఇస్తున్నాడనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మను ఎవరు?
మను అసలు పేరు మనోజ్ తూము (Manoj Toomu). ఇప్పటివరకు Amazonలో పనిచేశాడు. గత జూన్‌లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇప్పుడు Metaలో కొత్త ఉద్యోగం ప్రారంభించబోతున్నాడు.
తన కొత్త ఉద్యోగం
Meta Advertising Research Team Machine Learning Software Engineer
వార్షిక ప్యాకేజీ: $400,000 అంటే సుమారుగా రూ.3.6 కోట్లు
Amazon నుంచి Metaకు ఎందుకు?
Amazon కూడా చిన్న కంపెనీ కాదు. మను ఆ ఉద్యోగాన్ని వదిలి ఎందుకు వెళ్లాడు అంటే.. AI ఇండస్ట్రీ చాలా వేగంగా మారుతోంది. Amazonలో మంచి అనుభవం సంపాదించాను. కానీ మరింత చాలెంజింగ్ గా ఉండే ప్రాజెక్ట్స్ కావాలనిపించింది. అందుకే కొత్త అవకాశాల కోసం వెతకడం మొదలుపెట్టానని చెప్పాడు.
మారిన AI విధానం
మను చెప్పినట్టు, AI ఇప్పుడేం కేవలం మనుషుల డెసిషన్ మీద ఆధారపడి ఉండటం లేదు. రోజురోజుకీ Deep Learning, Neural Networks లాంటి టెక్నాలజీలు గణితాలను నేర్చుకొని స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అంటే, ముందు మనం కోడ్ రాస్తే, ఇప్పుడు మిషీన్లు నేర్చుకుంటున్నాయి.
చదువు, కోర్సులు & ట్రైనింగ్
మను 2022లో తన మాస్టర్స్ పూర్తి చేశాడు. తర్వాత వెంటనే AI ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాడు. అంటే, చాలా చిన్న వయసులోనే మంచి అనుభవాన్ని పొందాడు. ఇది కూడా అతనికి Meta లో జాబ్ రావడానికి కారణమని చెప్పవచ్చు.
మను చెప్పే టిప్స్
1. ఇంటర్న్‌షిప్స్ మిస్ కావొద్దు
కాలేజీలో చదువుతున్నప్పుడే ఇంటర్న్‌షిప్స్ చేయండి
ఫ్రీ అయినా, తక్కువ స్టైపెండ్ ఉన్నా అనుభవం చాలా ముఖ్యం
2. జాబ్ టైటిల్స్ మీద అయోమయం కావొద్దు
Applied Scientist, ML Engineer, Research Scientist పేర్లు మారవచ్చు, కానీ పనితనం చాలా ముఖ్యం.
3. శాలరీ గురించి తొందరపడొద్దు
కెరీర్ ప్రారంభంలో ఎక్కువ డబ్బు కాదు, మంచి స్కిల్స్ మీద ఫోకస్ చేయండి
మీ బేస్ పెరిగిన తర్వాత పెద్ద కంపెనీలు మీ వెనక పడతాయి
4. ఎల్లప్పుడూ కొత్తదాన్ని నేర్చుకుంటూ ఉండండి
AI, ML రంగం రోజు రోజుకీ మారుతుంది. అందుకే విద్యాభ్యాసం ఎప్పటికీ ఆపకూడదు. నిజంగా శ్రమించి నేర్చుకుంటే, చిన్నదిగా మొదలుపెట్టి పెద్దగా ఎదగవచ్చని నిపుణులు చెబుతున్నారు. మను జీవితం మనకో స్ఫూర్తి అని చెప్పవచ్చు. అతని లక్ష్యం పెద్ద కంపెనీ కాదు. పెద్ద అవకాశాలు కావాలనే దాని కోసం అతను కృషి చేశాడు. ఇప్పుడు Meta లాంటి కంపెనీలో జాబ్ సాధించాడు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి