Andhra Pradesh: ఊరినే తాకట్టుపెట్టిన వైసీపీ నేత..!
ABN , Publish Date - Feb 09 , 2025 | 01:02 PM
పుల్లల చెరువు మండలం ఇసుక త్రిపురవరం గ్రామ రెవెన్యూలోని సర్వే నెం. 296లో 836 ఎకరాల భూమి ఉంది. అదే సర్వే నంబరులో సిద్దెనపాలెం గ్రామం కూడా ఉంది. ఆ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు..
ఊరిని తాకట్టుపెట్టిన వైసీపీ నేతపై చర్యలు.
అక్రమ ఆన్లైన్.. ఆపై బ్యాంకులో లోన్.
అరెస్టు చేసిన పోలీసులు.
రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్.
పుల్లలచెరువు, ఫిబ్రవరి 9: గ్రామానికి చెందిన భూమిని ఆక్రమంగా ఆన్‌లైన్ చేయించుకొని ఆపై ఊరిని తాకట్టు పెట్టిన వైసీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను కోర్టులో హాజరుపర్చగా న్యాయాధికారి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుల్లల చెరువు మండలం ఇసుక త్రిపురవరం గ్రామ రెవెన్యూలోని సర్వే నెం. 296లో 836 ఎకరాల భూమి ఉంది. అదే సర్వే నంబరులో సిద్దెనపాలెం గ్రామం కూడా ఉంది. ఆ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గడ్డం సుబ్బయ్య ఈ భూమిలో 4.32 ఎకరాలు, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కొల్లి వీరబ్రహ్మయ్య 4.00 ఎకరాల భూమిని ఆక్రమంగా 2020లో ఆన్లైన్ చేయించుకున్నారు. గడ్డం సుబ్బయ్య వెంటనే ముటుకుల సొసైటీకి ఆ భూమిని తాకట్టు పెట్టారు. 2020లో రూ. 3లక్షల రుణం పొందాడు.
దీనిపై శుక్రవారం గ్రామానికి చెందిన మాగులూరి లక్ష్మమ్మతోపాటు మరికొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకుడు గడ్డం సుబ్బయ్య.. మాగులూరి లక్ష్మమ్మను బెదిరించి, దుర్భాషలాడారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఎల్. సంపత్‌కుమార్ కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకుడు సుబ్బయ్యను అరెస్టు చేసి మార్కాపురం కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. అయితే 2020లో 'ఆంధ్రజ్యోతిలో 'ఊరినే ఆన్లైన్.. ఆపై తాకట్టు' శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి విదితమే. అయితే అప్పటి మంత్రి రాజకీయ ఒత్తిడితో ఆ భూమిపై విచారణ చేయకుండా వదిలేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సదరు కబ్జా నాయకుడిపై చర్యలు చేపట్టారు.
Also Read:
రూ.700 కమ్మల కోసం రూ.1.2 కోట్ల నగలు..
ఈ రైతులకు పీఎం కిసాన్ యోజన డబ్బులు రావు..
విమానంలో సురక్షితమైన సీట్లు ఇవే.. ప్రమాదం జరిగినా..
For More Andhra Pradesh News and Telugu News..