Share News

YS Vivekananda Reddy Attack Case: వివేకా హత్య కేసులో లోతైన దర్యాప్తు: కోర్టు సంచలన నిర్ణయం

ABN , Publish Date - Dec 10 , 2025 | 09:45 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని సీబీఐ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది.

YS Vivekananda Reddy Attack Case: వివేకా హత్య కేసులో లోతైన దర్యాప్తు: కోర్టు సంచలన నిర్ణయం

హైదరాబాద్, డిసెంబర్ 10: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని సీబీఐ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. వివేకా హత్య కేసు తదుపరి దర్యాప్తు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. సునీత వాదనలతో సీబీఐ కోర్టు ఏకీభవించింది. ఆయన కుమార్తె వైఎస్ సునీత పిటిషన్‌ను షరతులతో కోర్టు అనుమతించింది.

వివేకా హత్య కేసులో లోతైన దర్యాప్తునకు కోర్టు ఆదేశిస్తే.. సిద్దమని గతంలోనే కోర్టుకు సీబీఐ స్పష్టం చేసిన విషయం విదితమే. వైఎస్ సునీత అభ్యర్థనకు సమ్మతి తెలుపుతూ వివేకా హత్య కేసులో ఏ2 సునీల్ యాదవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరగలేదని, పలు అంశాలపై దర్యాప్తు అసమగ్రంగా ఉందని నిందితుల అంటున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సీబీఐ కోర్టుకు ఆయన కుమార్తె సునీతారెడ్డి నివేదించారు. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలంటూ సునీత సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు డిసెంబర్ 6వ తేదీనే ముగిశాయి. అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టులో సునీత తరఫు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, న్యాయవాది ఎస్ గౌతం.. తమ వాదనలు వినిపించారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. సునీత పిటిషన్‌తో ఏకీభవించింది. వైఎస్ వివేకా హత్య కేసులో లోతైన దర్యాప్తు జరగాలని సీబీఐ కోర్టు స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

సీతాఫలం నుంచి గింజలను సింపుల్‌గా ఇలా వేరు చేయవచ్చు..

మరికొన్ని గంటల్లో దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్న భవానీలు

Read Latest AP News and National News

Updated Date - Dec 10 , 2025 | 09:57 PM