Breaking: వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:49 PM
కాంగ్రెస్ మాజీ ఎంపీ, దివంగత నాయకుడు వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ దర్యాప్తు కొనసాగించే విషయంలో ట్రయల్ కోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేయాలని సునీతకు సుప్రీం ధర్మాసనం సూచించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: కాంగ్రెస్ మాజీ ఎంపీ, దివంగత నాయకుడు వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ దర్యాప్తు కొనసాగించే విషయంలో ట్రయల్ కోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేయాలని సునీతకు సుప్రీం ధర్మాసనం సూచించింది. రెండు వారాల్లో పిటిషన్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. పిటిషన్ దాఖలు చేసిన ఎనిమిది వారాల్లో నిర్ణయం ప్రకటించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం. మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ధర్మాసనం ఆదేశించింది. సీబీఐ తదుపరి దర్యాప్తు కొనసాగించే విషయంలో ట్రయల్ కోర్టు నిర్ణయం వెలువడే వరకు అన్ని బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
మంగళవారం నాడు వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోర్టుకు సీబీఐ తెలిపింది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని.. అందుకు కోర్టు తగిన ఆదేశాలిస్తే తాము దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ పేర్కొంది. సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు.
Also Read:
జగన్ అసెంబ్లీకి రా.. తేల్చుకుందాం: మంత్రి ఆనం
మసూద్ కుటుంబం ముక్కలైంది.. జైషే కమాండర్
For More Andhra Pradesh News and Telugu News..