Marriage: ఎందుకో ఏమో.. పెళ్లి పీట లెక్కకుండానే వరుడు జంప్..
ABN , Publish Date - Aug 11 , 2025 | 06:37 PM
మరికొద్ది గంటల్లో వివాహం. వధువు తరుపు వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో.. వరుడు పరారయ్యాడు.
ఏలూరు, ఆగస్ట్ 11: బాయ్ ఫ్రెండ్స్ చేత అగ్ని సాక్షిగా తాళికట్టిన భర్తలను భార్యలు అత్యంత దారుణంగా అంతమొందిస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే బాయ్ ఫ్రెండ్స్‌తో భార్యలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన భర్తలు సైతం కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. భర్తే దగ్గర ఉండి మరి.. భార్యకు బాయ్ ఫ్రెండ్స్‌తో వివాహం జరిపిస్తున్నారు. ఇక భర్తను వదిలి బాయ్ ఫ్రెండ్స్‌తో భార్యలు వెళ్లిపోతున్న ఘటనలు కూడా ఉన్నాయి.
అంతేకాదు.. ఆ తర్వాత సదరు భర్తలు.. ప్రియుడితో కలిసి తనను హత్య చేయలేదంటూ పెద్ద పార్టీలు చేసుకుంటున్న భర్తలు ఖుషీ ఖుషీ అవుతున్న కథనాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అలాంటి వేళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి గ్రామంలో పెళ్లి పీటలు ఎక్కుకుండానే వరుడు పారిపోయాడు. దీంతో వధువుతోపాటు ఆమె తరఫు బంధువులు పోలీసులను ఆశ్రయించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన సత్యనారాయణకు గోపాలపురం మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అందుకు ముహూర్తం సైతం ఖరారు చేశారు. ఆ ఘడియలు రానే వచ్చాయి. వివాహానికి వధువు ముస్తాబు అయింది. ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. భోజనాలతోపాటు విందు, వినోద కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు. ఇంతలో ఏమైందో ఏమో.. పెళ్లికొడుకు విడిది ఇంటిలో కనిపించకుండా పోయాడు.
ఈ విషయాన్ని గమనించిన వధువు తరఫు బంధువులు.. వరుడి కుటుంబ సభ్యులోపాటు బంధువులను నిలదీశారు. దీంతో వారు సైతం వరుడు విషయం తమకు తెలియదంటూ చేతులెత్తేశారు. ఆ క్రమంలో దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు వధువు తరఫు బంధువులు చేరుకున్నారు. అనంతరం వారంతా వివాహానికి సంబంధించిన ఫ్లెక్సీలు చేత పట్టి.. వరుడిని అరెస్ట్ చేయాలంటూ వధువు బంధువులు ఆందోళన చేపట్టారు. అనంతరం వరుడిపై పోలీసులకు వధువు తరపు బంధువులు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో వరుడు తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పులివెందులలో ఎన్నికల వేళ.. వైసీపీకి హైకోర్టు షాక్
సిగ్గు చేటు జగన్: హోమ్ మంత్రి అనిత
For More AndhraPradesh News And Telugu News