Raghuram: సునీల్ చెబితేనే వచ్చారు... ఆకివీడు ఘటనపై రఘురామ
ABN , Publish Date - Feb 06 , 2025 | 12:23 PM
Raghurama: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆకివీడులో నిన్న జరిగిన ఘటనపై సునీల్ బాధ్యత వహించాలన్నారు. సునీల్ అనుచరుడిని వెంటనే చర్యలు తీసుకోవాలని రఘురామ అన్నారు.
పశ్చిమగోదావరి, ఫిబ్రవరి 6: ఆకివీడులో పోలీసు స్టిక్కర్ వేసుకుని సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ (Former CID Chief Sunil Kumar) అనుచరులు హల్‌చల్ చేసిన ఘటనపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు (Deputy Speaker Raghurama Krishnam Raju) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆకివీడులో నిన్న (బుధవారం) సాయంత్రం ఇన్నోవా కారులో పోలీసు అని స్టిక్కర్ వేసుకుని కొంత మంది వ్యక్తులు మున్సిపాలిటీ వద్ద గొడవ చేశారని అన్నారు. గుత్తికొండ వెంకట జోగారావు పేరు మీద ఆ కారు ఉందని.. సునీల్ కుమార్ చెబితే వాళ్ళు వచ్చినట్టు తాను తెలుసుకున్నానన్నారు. ఇంత విచ్చల విడిగా రౌడీయిజం చేయడానికి చూస్తే ఏం చర్యలు తీసుకుంటారని అన్నారు.
సునీల్ కుమార్ అనుచరుడు జోగారావుపై చర్యలు తీసుకోవాలన్నారు. అంబేద్కర్ మిషన్‌కు తనకు సంబంధం లేదని సునీల్ కుమార్ చెప్పగలడా అని ప్రశ్నించారు. నిన్న జరిగిన సంఘటనకు సునీల్ కుమార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వాళ్ళ కారులో వచ్చి ప్రభుత్వ కార్యాలయంపై దాడి చేశారని.. సునీల్ కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ‘‘నా కస్టోడియల్ కేసులో సునీల్ కుమార్ పార్టీ పెట్టుకున్నా నేను వదిలేది లేదు. నా హృదయానికి తెలిసి నేను ఏ తప్పూ చేయడం లేదు’’ అని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.
Emotional Incident.. వృద్ధ దంపతులకు తీరని కష్టం ..
కాగా... పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఫోటోలు కలకలం రేపాయి. కారుపై సునీల్ కుమార్ ఫోటోతో ఆయన అనుచరులు హల్‌చల్ చేశారు. ఆకివీడులో కోర్టు అనుమతులతో అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఆక్రమణదారులకు మద్దతుగా ఘర్షణ సృష్టించేందుకు సునీల్ కుమార్, అంబేద్కర్ ఫోటోలతో పాటు పోలీసు స్టిక్కర్లతో సునీల్ కుమార్ అనుచరులు ఆకివీడులో తిరుగుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు... వివాదం తలెత్తే అవకాశం ఉండటంతో వెంటనే అప్రమత్తమయ్యారు. మరోవైపు రఘురామకృష్ణరాజు నియోజకవర్గం కావడం, రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ కీలకంగా ఉండటంతో అలర్ట్ అయిన పోలీసులు కారుతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి...
మోడీ వినూత్న ఆలోచన.. విద్యార్థుల కోసం ఏకంగా..
మీ భార్య అకౌంట్‌కు డబ్బులు పంపుతున్నారా? ఈ రూల్ తెలుసుకోండి..
Read Latest AP News And Telugu News