Share News

AP CM Kuppam Tour: కుప్పంకు కృష్ణా జలాలను తీసుకువచ్చాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 30 , 2025 | 06:07 PM

నీటి విలువ తెలిసిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంలో కృష్ణమ్మకు జల హారతి ఇచ్చిన సీఎం.. హంద్రీనీవా కాల్వల విస్తరణ పనుల ద్వారా కుప్పంలో చివరి భూముల వరకు కృష్ణ జలాలు చేరాయని సంతోషం వ్యక్తం చేశారు.

AP CM Kuppam Tour: కుప్పంకు కృష్ణా జలాలను తీసుకువచ్చాం: సీఎం చంద్రబాబు
AP CM Kuppam Tour

కుప్పం, ఆగస్టు 30 : నీటి విలువ తెలిసిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తుశుద్ధి అంటే ఏదైనా సాధ్యమని, ముఠా రాజకీయాలు లేకుండా చేసిన పార్టీ టీడీపీ అని ఆయన చెప్పారు. హంద్రీనీవా ఫేజ్‌-1, 2 లతో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, హంద్రీనీవాతో పరిశ్రమలకు కూడా నీళ్లు ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. హంద్రీనీవాతో చిత్తూరుకు కూడా నీళ్లిచ్చే బాధ్యత నాదని సీఎం చెప్పారు.

kuppam-chandrababu-4.jpg


సీఎం చంద్రబాబు ఇవాళ కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. కుప్పంలో కృష్ణమ్మకు జల హారతి ఇచ్చిన సీఎం.. హంద్రీనీవా కాల్వల విస్తరణ పనుల ద్వారా కుప్పంలో చివరి భూముల వరకు కృష్ణ జలాలు చేరాయని సంతోషం వ్యక్తం చేశారు. పరమసముద్రంలో బహిరంగ సభలో కుప్పం ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు. కుప్పానికి రెండేళ్లు ముందుగానే కృష్ణా పుష్కరాలు వచ్చాయన్నారు.

kuppam-chandrababu.jpg


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఇంకా అనేక అంశాలపై మాట్లాడారు. 'రాజకీయం అంటే రౌడీయిజం కాదు. సూపర్ సిక్స్‌.. సూపర్ హిట్‌. పోలవరం-బనకచర్ల పూర్తయితే ఎంతో ఉపయోగం. నదుల అనుసంధానంతో కరవు ఉండదు.. తెలంగాణ నేతలు ఈ విషయాన్ని గ్రహించాలి. వైసీపీ విష వృక్షంగా తయారైంది.. ఏ మంచి పనిచేసినా వైసీపీ దానిపై విష ప్రచారం చేస్తుంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు అత్యంత కీలకం. పోలవరం-బనకచర్ల పూర్తి చేస్తే కరవు అనే సమస్య ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాలకు నదుల అనుసంధానం అవసరం. మంచి పనులు చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారు. కొందరు విషవృక్షంలా మారి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. కుప్పంలో రఫ్పా రఫ్పా రాజకీయం చేయాలనుకున్నారు. పులివెందుల, ఒంటిమిట్టలో ఏం జరిగిందో అందరూ చూశారు. దేశానికే అన్నదాతగా కృష్ణా, గోదావరి రైతులు. హంద్రీనీవా నీళ్లు తరలించేందుకు 27 లిఫ్ట్‌ ఇరిగేషన్లు ఏర్పాటు చేశాం. కుప్పానికి రెండేళ్ల కంటే ముందే కృష్ణా పుష్కరాలు వచ్చాయి' అని చంద్రబాబు చెప్పారు.

kuppam-chandrababu-3.jpg


ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమగా ఉండేదన్న సీఎం చంద్రబాబు.. ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలాలను తీసుకువచ్చామని, కృష్ణా జలాలను సీమకు తరలించాలని ఎన్టీఆర్‌ భావించారని అది ఇప్పుడు నెరవేర్చామని తెలిపారు. 'నేను ఏ పనిచేయాలన్నా వెంకన్నపై భారం వేసి బుల్లెట్‌లా దూసుకెళ్తా. పవిత్రమైన సంకల్పం ఉంటే జయప్రదమవుతుంది. 2014-19 మధ్య రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.12,500 కోట్లు వ్యయం చేశాం. వైసీపీ పాలనలో కేవలం రూ.2వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. నీళ్లు వస్తే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతీ చెరువుకు నీరు ఇచ్చే బాధ్యత నాది. వైసీపీ నేతలు గేట్ల సెట్టింగ్ వేసి డ్రామాలాడారు. జగన్ హెలికాప్టర్‌ ఎక్కేలోపే నీరు ఆగిపోయింది. అబద్ధాలు చెప్పడంలో వైసీపీ దిట్ట. అసాధ్యమైన పనులను సాధ్యం చేయడం NDA లెక్క.' అంటూ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

kuppam-chandrababu-6.jpg


ఇవి కూడా చదవండి..

మాజీ ఎమ్మెల్యే పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్న జగదీప్ ధన్‌ఖడ్

చొరబాట్ల స్పెషలిస్ట్ బాగూఖాన్ ఖేల్ ఖతం.. ఎన్‌కౌంటర్‌లో హతం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 30 , 2025 | 06:21 PM