Share News

Visakhapatnam: తూర్పు తీరంలో విశాఖ ప్రాంతం ఓ మణిహారం

ABN , Publish Date - Nov 13 , 2025 | 08:52 PM

జీవీఎంసీ, వీఎంఆర్డీఏలు.. ఇతర విభాగాలతో కలిసి విశాఖ ప్రాంతాన్ని అత్యంత క్రియాశీలకంగా తీర్చిదిద్దుతామని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. అభివృద్ధి ప్రయాణం ఇప్పటికే ప్రారంభమైంది.. స్వర్ణాంధ్ర విజన్ 2047, వికసిత్ భారత్ లక్ష్యాలలో విశాఖ కీలకం..

Visakhapatnam: తూర్పు తీరంలో విశాఖ ప్రాంతం ఓ మణిహారం
Visakhapatnam development

విశాఖపట్నం, నవంబర్ 13: తూర్పు తీరంలో విశాఖ ప్రాంతం ఓ మణిహారం.. దీనిని గ్లోబల్ ఎకనామిక్ హబ్ గా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. స్వర్ణాంధ్ర 2047 మిషన్ లో భాగంగా సమీకృత, సుస్ధిరాభివృద్ధితో కూడిన సుపరిపాలనను ప్రభుత్వం అందిస్తోందన్నారు. 2029 నాటికి 135 బిలియన్ ఎకనామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.


విశాఖ ఎకనామిక్ రీజియన్ సదస్సులో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తన ప్రసంగంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ముందుకు సాగుతున్నామని, 15 మాస్టర్ ప్లాన్ క్లస్టర్లు, పారిశ్రామిక నగర ప్రాంతాలను విశాఖ ఎకనామిక్ రీజియన్‌లో తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు.


'అర్బన్ మొబిలిటినీ రీడిఫైన్ చేస్తున్నాం. 77 కిలోమీటర్ల మెట్రో రైల్, గ్రీన్, ఇంటెలిజెంట్ గవర్నెన్సుతో పురపాలన సాగేలా 4వేల ఈవీ బస్సులు, వాహనాలను వినియోగించి పర్యావరణ హితంగా తీర్చిదిద్దుతాం. సుస్థిర పట్టణాభివృద్ధికి ఓ మోడల్ గా విశాఖ ఎకనమిక్ రీజియన్‌ను తీర్చిదిద్దుతాం. పౌరులకు ఆధునిక సాంకేతికతతో కూడిన సుపరిపాలన అందించేలా ప్రణాళికలు చేశాం. జీవీఎంసీ, వీఎంఆర్డీఏలు ఇతర విభాగాలతో కలిసి ఈ ప్రాంతాన్ని అత్యంత క్రియాశీలకంగా తీర్చిదిద్దుతాం. విశాఖ అభివృద్ధి ప్రయాణం ఇప్పటికే ప్రారంభమైంది. గూగుల్ డేటా సెంటర్ , ఐటీ కేంద్రాలతో అభివృద్ధి మోడల్‌గా ఈ ప్రాంతం తయారవుతోంది. స్వర్ణాంధ్ర విజన్ 2047, వికసిత్ భారత్ లక్ష్యాలలో విశాఖ కీలకంగా మారనుంది.' అని మంత్రి నారాయణ తెలిపారు.


ఇవీ చదవండి:

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..

Terror Accused Shaheen: అలా చేసిందంటే నమ్మశక్యంగా లేదు: షాహీన్ కుటుంబం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2025 | 08:52 PM