Share News

NTR Trust: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో తలసేమియా రన్

ABN , Publish Date - Jul 11 , 2025 | 09:11 PM

తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా నిలబడేందుకు విశాఖపట్నం వేదికగా రన్ నిర్వహించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయించింది. అలాగే విశాఖపట్నంలో తలసేమియా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ట్రస్ట్ సీఈవో ప్రకటించారు.

NTR Trust: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో తలసేమియా రన్
NTR Trust

విశాఖపట్నం, జులై 11: తలసేమియా వ్యాధిపై అవగాహనతో పాటు వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచేందుకు విశాఖపట్నంలో రన్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ వెల్లడించింది. జులై 19వ తేదీన విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌ రోడ్డులో 3కె, 5కె, 10కె విభాగాల్లో ఈ రన్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వాహాణాధికారి రాజేంద్ర కుమార్ వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలో రాజేంద్రకుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు వెళ్తుందన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వివరించారు. అందులోభాగంగానే తలసేమియాపై అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా ఈ రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. తలసేమియాపై ఉద్యమం చేయాలని ఎన్టీఆర్ ట్రస్టు నడుం బిగించిందన్నారు. ఈ తలసేమియా రన్‌లో ప్రముఖ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.


ఈ రన్ అనంతరం ప్రముఖ గాయని సమీరా భరద్వాజ్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ రన్‌లో ఐదు వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని చెప్పారు. త్వరలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో తలసేమియా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. తలసేమియాతో అనేక మంది పిల్లలు బాధపడుతున్నారని గుర్తు చేశారు. జన్యుపరమైన లోపం వలన తలసేమియా వ్యాధి వస్తుందని వివరించారు.


ఈ వ్యాధిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఈ తరహా కార్యక్రమాలు చేపడుతున్నామని ట్రస్ట్ సీఈవో రాజేంద్ర కుమార్ వెల్లడించారు. మరోవైపు ఇదే వ్యాధిపై గతంలో విజయవాడ ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా వచ్చిన నిధులను సైతం తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ వినియోగించిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!

అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో తలసేమియా రన్

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 11 , 2025 | 10:09 PM