Share News

Heavy Rains Alert In State: మళ్లీ భారీ వర్షాలు..

ABN , Publish Date - Oct 01 , 2025 | 05:18 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహాణ సంస్థ ఎండీ స్పందించారు.

Heavy Rains Alert In State: మళ్లీ భారీ వర్షాలు..

విశాఖపట్నం, అక్టోబర్ 01: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఇవాళ (బుధవారం) వెల్లడించారు. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పారు. ఇది ప్రస్తుతానికి విశాఖపట్నానికి 400 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌‌కి 420 కిలోమీటర్లు, పారాదీప్‌కి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని స్పష్టం చేశారు.


శుక్రవారం తెల్లవారుజామున అంటే.. అక్టోబర్ 3వ తేదీన ఇది గోపాల్‌పూర్- పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వివరించారు. దీని ప్రభావంతో గురువారం ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాయలసీమలో సైతం విస్తారంగా వర్షాలు పడతాయని వివరించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ ఈ సందర్భంగా మత్స్యకారులను హెచ్చరించారు.


అలాగే కోస్తాలో బుధవారం నాడు విశాఖ, విజయనగరం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, కాకినాడ తదితర జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక గురువారం ఉత్తర కోస్తాజిల్లాలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

చోరబాటుదారులతో దేశానికి ముప్పు:ప్రధాని మోదీ

నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..

For More AP News And Telugu News

Updated Date - Oct 01 , 2025 | 06:04 PM