Kottapally Crime News: బీమా డబ్బుల కోసం మామ హత్య.. యాక్సిండెంట్‌గా చిత్రీకరణ
ABN , Publish Date - Dec 13 , 2025 | 09:14 PM
ఈ మధ్య కాలంలో కొంతమంది డబ్బు కోసం దేనికైనా తెగబడుతున్నారు. మానవత్వపు విలువలు మరిచి సొంతవాళ్లు అని కూడా చూడకుండా దోపిడి, హత్యలకు పాల్పపడుతున్నారు. అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
ఆంధ్రజ్యోతి, ఇంటర్నెట్ డెస్క్: డబ్బుకు లోకం దాసోహం.. ఈ కాలంలో డబ్బుకు ఇచ్చే విలువు మనుషుల ప్రాణాలకు ఇవ్వడం లేదు. డబ్బు కోసం సొంత, పరాయి అన్న భేదాలు లేకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత మామను చంపుకున్నాడు అల్లుడు.. అతనికి కొడకు సాయం చేశాడు. ఈ దారుణ ఘటన అనకాపల్లి జిల్లా, కసింకోట మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది.
గత కొన్ని రోజులుగా మృతుడు నారాయణ రావు(54) బీమా డబ్బు కోసం ఆయన అల్లుడు అన్నవరం, మనవడు ప్రసాద్ ఇబ్బంది పెడుతూ వచ్చారు. అయితే, బీమా డబ్బు వాళ్లకు ఇవ్వడం ఇష్టం లేని నారాయణరావు ససేమిరా అన్నాడు. దీంతో మామపై కసిని పెంచుకున్నాడు అన్నవరం. ఆయన్ని చంపితే కానీ బీమా సొమ్ము రాదని నిర్ణయించుకున్నాడు. ఈ నెల తొమ్మిదిన కొత్తపల్లి రోడ్డులో నారాయణరావు తలపై రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణానికి కొడుకు ప్రసాద్ కూడా సహకరించాడు. అయితే.. హత్య అనంతరం ఓ కన్నింగ్ ప్లాన్ వేశాడు అన్నవరం. తన మానను ఏదో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది.. దాంతో అతను చనిపోయాడని కసింకోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. నారాయణరావుది ప్రమాదం కాదు.. హత్యగా నిర్ధారించారు పోలీసులు. ఈ క్రమంలోనే హత్య కేసుగా నమోదు చేశారు. అన్నవరం ని తమదైన స్టైల్లో విచారించారు. విచారణలో బీమా డబ్బు కోసం తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని, అతనికి కొడుకు కూడా సాయం చేశాడని అనకాపల్లి డి.ఎస్.పి ఎం శ్రావణి మీడియాకు వెల్లడించారు. డబ్బు కోసం మామను హత్య చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి: