Share News

CM Chandrababu: విశాఖలో త్వరలో సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు.. సీఎం ప్రకటన

ABN , Publish Date - Dec 07 , 2025 | 09:53 PM

విశాఖపట్నంలో త్వరలో సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖ అందాల్ని పెంచేందుకు తామెప్పుడూ కట్టుబడి ఉన్నామంటూ ఎక్స్ వేదికగా తెలిపారాయన.

CM Chandrababu: విశాఖలో త్వరలో సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు.. సీఎం ప్రకటన
CM Chandrababu Naidu

అమరావతి, డిసెంబర్ 07: విశాఖపట్నం(Visakhapatnam)లో త్వరలోనే సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారాయన. విశాఖలో క్రమంగా పాదచారుల మార్గాలు, గ్రీనరీలో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు సీఎం.


'విశాఖలో ఫుట్‌పాత్‌లు, పెరిగిన పచ్చదనం సందర్శకుల అనుభవాన్ని మెరుగుపర్చాయని చెప్పేందుకు ఆనందంగా ఉంది. నగరం అందాల్ని మరింతగా పెంచడం.. పర్యావరణ హితంగా, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు గానూ త్వరలోనే సైక్లింగ్ ట్రాక్‌లు ప్రవేశపెట్టున్నాం' అని చంద్రబాబు అన్నారు.


అంతకముందు.. విశాఖను బెంగళూరులా కాకుండా ఫుట్‌పాత్‌లు, పచ్చదనం పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వడం ఆనందంగా ఉందంటూ సివిక్ అపోజిషన్ ఆఫ్ ఇండియా(Civic Opposition of India) ఎక్స్ వేదికగా తెలిపింది. ఇది ఇండియా(India)లో తదుపరి ఐటీ నగరాన్ని ప్రోత్సహించేలా ఉందని అందులో పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే నగరానికి సైక్లింగ్ ట్రాక్(Cycling Track) కూడా తీసుకురావాలని కోరుతూ.. విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh)ను ట్యాగ్ చేసింది. ఈ విషయమై చంద్రబాబు స్పందించారు.


ఇవీ చదవండి:

హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు: విజయసాయిరెడ్డి

ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈఓ చేతివాటం.. చివరకు.?

Updated Date - Dec 07 , 2025 | 11:22 PM