Minister Nara Lokesh: విద్యార్థి దశలోనే నైతిక విలువలు అలవర్చుకోవాలి..
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:26 PM
విద్యార్థుల్లో నైతిక విలువలను అలవర్చేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దానికోసమే చాగంటి కోటేశ్వరరావును రాష్ట ప్రభుత్వం సలహాదారుగా నియమించిందని గుర్తు చేశారు.
అమరావతి: ఏపీ శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 9600 ప్రాథమిక పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో ఈ తరహా టీచర్లను ఏర్పాటు చేయలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో లెర్నింగ్ అవుట్ కమ్స్ రావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. సమాజంలో మార్పు రావాలంటే విద్యార్థి దశలోనే నైతిక విలువలు అలవర్చుకోవడం చాలా ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు.
విద్యార్థుల్లో నైతిక విలువలను అలవర్చేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దానికోసమే చాగంటి కోటేశ్వరరావును రాష్ట ప్రభుత్వం సలహాదారుగా నియమించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి పైసా తీసుకోకుండా చాగంటి కోటేశ్వరరావు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. చాగంటి కోటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందిస్తోందని చెప్పారు. పిల్లల్లో నైతిక విలువలు పెంచేందుకు చాగంటి అద్భుతమైన పుస్తకాలను రూపొందించి ఇచ్చారని వివరించారు. చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పుస్తకాలను పిల్లలకు అందిస్తున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు