Tribals Protest In Anakapalli District: అనకాపల్లి జిల్లాలో గిరిజనులు వినూత్న నిరసన..
ABN , Publish Date - Sep 10 , 2025 | 03:43 PM
బిల్లులు చెల్లించడం లేదుంటూ రహదారి పనులను కాంట్రాక్టర్ అర్థాంతరంగా నిలిపి వేశారు. దీంతో గిరిజనులు ఆందోళనకు దిగారు.
అనకాపల్లి, సెప్టెంబర్ 10: బిల్లులు చెల్లించడం లేదుంటూ రహదారి పనులను కాంట్రాక్టర్ అర్థాంతరంగా నిలిపి వేశారు. దీంతో రహదారి మార్గం లేక.. గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు పూర్తిగా బురదమయం కావడంతో.. గిరిజనులు వినూత్న నిరసనకు దిగారు. ఆయా గ్రామస్తులంతా రహదారి మార్గంలో అర్థనగ్నంగా కూర్చోని నిరసన చేపట్టారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలోని రావికమతం మండలం చినపాచిల, ఆర్జాపురం గ్రామాల్లో చోటు చేసుకుంది. ప్రభుత్వం చొరవ తీసుని.. 8 వేల మంది కష్టాలను తీర్చాంటూ వారంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో రహదారులను పట్టించుకోలేదన్న సంగతి అందరికి తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువు తీరన తర్వాత.. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం రహదారుల నిర్మాణం చేపట్టింది. రహదారుల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసుకొంటూ వస్తుంది. అందులోభాగంగా కొంత ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్.. రహదారి పనులను మధ్యంలోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన గిరిజనులను ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు సరైన రహదారి సైతం లేక పోవడంతో.. గిరిజనులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని..తమ కష్టాలను తీర్చాలంటూ ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..
For More AP News And Telugu News