Share News

Assassination Case : హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి

ABN , Publish Date - Jan 29 , 2025 | 06:10 AM

మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి సవిత, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే సౌమ్య బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు.

Assassination Case : హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి

  • టీడీపీ గ్రీవెన్స్‌లో బాధితుల ఫిర్యాదులు

అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, చెరువులో చేపలు దొంగిలించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితులు టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి సవిత, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే సౌమ్య బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో అకారణంగా తమపైకి మారణాయుధాలతో దాడి చేసి ముగ్గుర్ని హతమార్చి, మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు కార్ధాల లక్ష్మి విజ్ఞప్తి చేశారు. పెద్దదిక్కు కోల్పోయిన తమకు ప్రాణహాని ఉందని ఆమె మొరపెట్టుకున్నారు. తమ పొలానికి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, దౌర్జన్యం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా చింతలపూడికి చెందిన సూర్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 06:11 AM