Share News

Vallabhaneni Vamshi: ముగిసిన విచారణ.. నెక్ట్స్ జరిగేది ఇదేనా..

ABN , Publish Date - Feb 13 , 2025 | 09:34 PM

కృష్ణలంక పీఎస్‌లో వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటలపాటు వంశీని పోలీసులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం వంశీని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్టేషన్ నుంచి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు పోలీస్ స్టేషన్ పక్క గేటు నుంచి వంశీని ఆస్పత్రికి తరలించారు..

Vallabhaneni Vamshi: ముగిసిన విచారణ.. నెక్ట్స్ జరిగేది ఇదేనా..
Vallabhaneni Vamshi

విజయవాడ, ఫిబ్రవరి 13: కృష్ణలంక పీఎస్‌లో వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటలపాటు వంశీని పోలీసులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం వంశీని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్టేషన్ నుంచి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు పోలీస్ స్టేషన్ పక్క గేటు నుంచి వంశీని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. వైద్య పరీక్షల తరువాత వంశీని జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా, సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపు, దాడి కేసులో వంశీపై పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీని ఏ1గా చర్చేసిన పోలీసులు.. మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఏ7 ఎలినేని వెంకట శివరామకృష్ణ, ఏ8 నిమ్మ లక్ష్మీపతిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు పోలీసులు. మెడికల్ టెస్ట్‌లు అయిపోయిన తరువాత మెడికల్ సర్టిఫికెట్‌తో కోర్టులో హాజరుపరచనున్నారు. వల్లభనేని వంశీపై సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగానే వంశీపై కిడ్నాప్ సెక్షన్లతో పాటు.. అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.


తరువాత ఏంటి..

వైద్య పరీక్షల అనంతరం వంశీని కోర్టులో హాజరుపరుచనున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఛార్జి షీట్‌ను పోలీసులు సిద్ధం చేశారు. దీని ఆధారంగా జడ్జి ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఉత్కంఠ నెలకొంది.


Also Read:

ఇద్దరు మహిళలు కలిస్తే ఇలాగే ఉంటుందేమో..

బర్డ్ ఫ్లూ.. సీఎస్ విజయానంద్ ఏం చెప్పారంటే..

అప్పుల తెలంగాణ.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Feb 13 , 2025 | 09:34 PM