Tomato: టమోటాకు టైమొచ్చింది.. కిలో ఎంతంటే..
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:08 PM
ఎట్టకేలకు టమోటాకు గిట్టుబాటు ధర దక్కుతోంది. ఏడాదిగా ధరల్లేక రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. కూలి ఖర్చులు కూడా దక్కలేదు. కొంతమంది పంటను చేనులోనే వదిలేశారు. ఇంకొందరు తొలగించి, రోడ్డు పక్కనే పడేశారు.
- ఏడాది తర్వాత ధరలు
- కిలో రూ.30 నుంచి రూ.44 మధ్య పలుకుతున్న వైనం
- రైతుల్లో ఆనందం
అనంతపురం: ఎట్టకేలకు టమోటా(Tomato)కు గిట్టుబాటు ధర దక్కుతోంది. ఏడాదిగా ధరల్లేక రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. కూలి ఖర్చులు కూడా దక్కలేదు. కొంతమంది పంటను చేనులోనే వదిలేశారు. ఇంకొందరు తొలగించి, రోడ్డు పక్కనే పడేశారు. గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ రైతులు రోడ్డెక్కి నినదించారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు టమోటా ధరలు పెరుగుతున్నాయి. దీంతో అన్నదాతకు ఉపశమనం దక్కుతోంది.
పెరుగుతున్న ధరలు..
జిల్లాలో 5,600 హెక్టార్లలో టమోటా ప్రస్తుతం సాగుతో ఉంది. ఇందులో 30 శాతం వరకు కోత దశలో ఉన్నట్లు ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. కక్కలపల్లి టమోటా మార్కెట్‌కు రోజూ 3 వేల టన్నులకుపైగా టమోటా ఉత్పత్తులు వస్తున్నాయి. ఇతర ప్రాంత మార్కెట్లలోనూ ఆశించిన స్థాయిలో టమోటా ఉత్పత్తులు లేకపోవడం ఇక్కడ ధరల పెరుగుదలకు కారణం.

వారం రోజులుగా ధరలు స్థిరంగా పలుకుతున్నాయి. గరిష్ఠంగా రూ.30 నుంచి రూ.44 మధ్య అమ్ముడుపోతున్నాయి. 15కిలోల బాక్సు రూ.450 నుంచి రూ.660 వరకు పలుకుతోంది. గతంలో మచ్చలున్నవి, గోలీల్లాంటి కాయలను పడేసేవారు. ప్రస్తుతం వాటికి కూడా మంచి ధర దక్కుతోంది. వీటి ధర కూడా 15 కిలోల బాక్సు రూ.వందకిపైగానే పలుకుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇది రాజకీయం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం!
బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి
Read Latest Telangana News and National News