Thalliki Vandanam Program: ఇంటర్మీడియట్ విద్యార్థులకు తల్లికి వందనం నిధులు విడుదల
ABN , Publish Date - Jul 20 , 2025 | 05:50 PM
9, 10 తరగతుల ఎస్సీ డే- స్కాలర్ విద్యార్థులకు రూ.10,900 మొత్తాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక 9, 10 తరగతుల ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు రూ.8,800 నగదు మొత్తాన్ని ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో వేసింది.
అమరావతి, జులై 20: కూటమి ప్రభుత్వం ఒక్కొ పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌తోపాటు ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 9, 10 విద్యార్థులకు.. అలాగే ఇంటర్మీడియట్ మెుదటి, రెండో సంవత్సరం షెడ్యూల్డ్ క్యాస్ట్(ఎస్సీ) విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ పథకం ద్వారా 3.93 లక్షల మంది విద్యార్థులకు ఆర్థిక సహాయంలో 40 శాతం వాటాగా.. రూ.382.66 కోట్లను తల్లుల ఖాతాలకు చంద్రబాబు సర్కార్ జమ చేసింది.
అలాగే 9, 10 తరగతుల ఎస్సీ డే- స్కాలర్ విద్యార్థులకు రూ.10,900 మొత్తాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఇక 9, 10 తరగతుల ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు రూ.8,800 నగదు మొత్తాన్ని ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో వేసింది. అదే విధంగా ఇంటర్మీడియట్ 1, 2వ సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు.. మొత్తం ర్యాంకింగ్ ఆధారంగా రూ.5,200 నుంచి రూ.10,972 వరకూ పిల్లల తల్లుల ఖాతాలో నగదు వేసింది.
ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాయి. ఆ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదికి తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో 67,27,164 మంది విద్యార్థులకు రూ. 15 వేలు చొప్పున నగదు జమ చేస్తున్నారు.
అయితే ఈ రూ.15 వేలల్లో రూ.2వేలు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాలకు మళ్లించి.. పాఠశాలల నిర్వహణ, అభివృద్ధి, పారిశుద్ధ్యం కోసం వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ తల్లికి వందనం నిధులను ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News