కలెక్టర్ ఉత్తర్వులను మార్చేసి...రూ.1,690 కోట్ల గ్రానైట్‌ను కొట్టేశారు
ABN , Publish Date - Jan 28 , 2025 | 04:57 AM
అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు బాధితులు టీడీపీ గ్రీవెన్స్‌లో వాపోయారు.
చీమకుర్తి అక్రమ మైనింగ్‌పై టీడీపీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు బాధితులు టీడీపీ గ్రీవెన్స్‌లో వాపోయారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి, ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన రంగారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తూ, ‘కలెక్టర్ ఉత్తర్వులను మార్చేశారు. కృష్ణసాయి గ్రానైట్స్ అక్రమ పద్ధతిలో మైనింగ్ లీజు పొందారు. రూ.1,690 కోట్ల విలువైన గ్రానైట్‌ను కొట్టేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పర్యావరణ అనుమతులకు మించి, చీమకుర్తి ప్రాంతంలో అధిక పరిమాణంలో తవ్వకాలు జరగుతున్నాయి. అధికారులు తప్పుడు నివేదికలతో అక్రమాలను కప్పిపెడుతున్నారు. వాటి మీద విచారణ జరిపించండి’ అని విజ్ఞప్తి చేశారు. ‘పాఠశాల విద్యార్థుల స్కూల్ యూనిఫాం 72 వేల జతలు కుట్టి ఇచ్చా. అందుకు రూ.19.34 లక్షలు ఇవ్వాలి. గత ప్రభుత్వం ఆ సొమ్ములు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. ఆ నిధులు విడుదల చేయించి, బిల్లులు చెల్లించేట్లు చూడండి’ అని కడపకు చెందిన హుస్సేన్ బాషా కోరారు. చంద్రన్న బీమాలో 1,800 మంది బీమా మిత్రలను గత ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని, తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల భూకబ్జాలపై పలువురు బాధితులు ఫిర్యాదులు చేశారు. సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని నేతలు హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News