Share News

TDP Mahanadu 2025: మహానాడుపై సందిగ్ధత

ABN , Publish Date - May 10 , 2025 | 03:56 AM

దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో టీడీపీ మహానాడు నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. మే 27 నుంచి కడపలో జరగాల్సిన మహానాడును వాయిదా వేసేందుకు లేదా కుదింపుపై పార్టీ నేతల చర్చలు కొనసాగుతున్నాయి

TDP Mahanadu 2025: మహానాడుపై సందిగ్ధత

  • దేశమంతా యుద్ధ వాతావరణం

  • పార్టీ వేడుక నిర్వహణ సరికాదని చర్చ

  • వాయిదా లేదా కుదింపుపై 14న నిర్ణయం

అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): పార్టీ అత్యున్నత వేడుక మహానాడు నిర్వహణపై టీడీపీ అధిష్ఠానం తర్జనభర్జన పడుతోంది. గత ఏడాది ఎన్నికల కారణంగా మహానాడును భారీగా నిర్వహించలేదు. ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినందున ఈ సారి ఘనంగా నిర్వహించుకోవాలని నిశ్చయించారు. మే 27, 28, 29 తేదీల్లో కడపలో దీనిని జరిపేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం అలముకున్న నేపథ్యంలో మహానాడును నిర్వహించాలా వద్దా అని పునరాలోచనలో పడింది. పాకిస్థాన్‌తో సంక్షోభ సమయంలో దీని నిర్వహణ సరికాదని పార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతుండగా.. మరికొందరు వేడుకలను మూడ్రోజులు కాకుండా.. రెండు లేదా ఒక్క రోజుకే కుదించి నిర్వహించాలని సూచిస్తున్నారు. మహానాడుకు ఇంకా 15 రోజులుపైగా సమయం ఉన్నందున ఈలోగా యుద్ధవాతావరణం చల్లబడితే యథావిధిగా నిర్వహించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. 14న జరిగే టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మిస్ వరల్డ్ 2025 వేడకలు..

ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్

పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్

For More AP News and Telugu New

Updated Date - May 10 , 2025 | 03:56 AM