JP Ventures: జేపీ వంచర్స్‌కు సుప్రీంకోర్టు షాక్
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:18 PM
జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో ఇసుక తవ్వకాలు జరిపిన జేపీ వెంచర్స్‌కు సుప్రీంకోర్టు బుధవారం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినందుకు ఎన్జీటి విధించిన రూ. 18 కోట్ల జరిమానాను రెండు వారాల్లో డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 03: జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో ఇసుక తవ్వకాలు జరిపిన జేపీ వెంచర్స్‌కు సుప్రీంకోర్టు బుధవారం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినందుకు ఎన్జీటి విధించిన రూ. 18 కోట్ల జరిమానాను రెండు వారాల్లో డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే జేపీ వెంచర్స్‌పై ఎన్జీటి విధించిన జరిమానాపై గతంలో విధించిన స్టేను సుప్రీంకోర్టు తొలగించింది. అలాగే అక్రమ ఇసుక తవ్వకాలపై న్యాయపోరాటం చేస్తున్న దండా నాగేంద్ర కుమార్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఈ సంద్భంగా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో అక్రమ తవ్వకాల విస్తీర్ణానికి.. దండా నాగేంద్ర కుమార్ దాఖలు చేసిన అఫిడవి లో ఉన్న అక్రమ తవ్వకాల విస్తీర్ణానికి మధ్య ఉన్న తేడాను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున దండా నాగేంద్ర కుమార్ ఇచ్చిన అఫిడవిట్‌లోని అంశాలను పరిశీలించి స్పష్టమైన అఫిడవిట్‌ను మరోసారి దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశాన్ని పర్యవేక్షించాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు సుప్రీంకోర్టు సూచించింది.
ఇసుక అక్రమ తవ్వకందారుల నుంచి రికవరీ అంశం ఎంత వరకు వచ్చిందంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వారిని సైతం ఇందులో ప్రతివాదులుగా చేరుస్తూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక జరిమానా చెల్లించకుండా హైకోర్టుకు వెళ్లిన అక్రమ ఇసుక దారులకు సంబంధించిన కేసులో త్వరిత గతిన తీర్పును వెల్లడించాలని హైకోర్టుకు సుప్రీం కీలక సూచన చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భూమిలోపల 60 బైకులు.. అసలేమైందంటే..
For More AP News And Telugu News