AP CM Srisailam visit: రేపు శ్రీశైలంలో గంగాహారతి.. పాల్గొననున్న సీఎం..
ABN , Publish Date - Jul 07 , 2025 | 07:19 PM
CM Chandrababu Srisailam Project Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం నిర్వహించనున్న జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
నంద్యాల, శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం ప్రాజెక్టును రేపు సందర్శించనున్నారు. రేపు ఉదయం పది గంటలకు నిర్వహించనున్న జలహారతి కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేయనున్నారు.అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన నాగార్జునసాగర్ కు నీళ్లు విడుదల చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం శ్రీశైలం గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మలరామనాయుడుకు ఈ మేరకు ఆహ్వానం పంపారు. గంగాహారతి కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొంటారు.
జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీ ఎత్తున వరదనీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project) నిండుకుండలా జలకళతో తొణికిసలాడుతోంది. నీటి మట్టం గరిష్ఠానికి చేరింది. ఎగువనుంచి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రేపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఉదయం గంగాహారతి నిర్వహించనున్న గంగాహారతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.