Road Accident In UP: తెలుగు వారికి తీవ్ర గాయాలు.. స్పందించిన కేంద్ర మంత్రి
ABN , Publish Date - Oct 30 , 2025 | 05:56 PM
శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు.
లక్నో, అక్టోబర్ 30: ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పుర్ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని కారు ఢీ కొట్టంది. ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించిన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరించారు. బాధితులు కోటబోమ్మాళి, బ్రాహ్మణతర్ల, పలాస ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.
ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను ఫోన్లో పరామర్శించారు. అనంతరం జూన్‌పుర్ జిల్లా కలెక్టర్‌తోపాటు వారణాసి ఎయిర్ పోర్ట్ అధికారులు, వైద్యులతో ఆయన మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని.. అన్ని విధాల అండగా ఉండాలని సంబంధిత అధికారులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ఇక ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరంతా వారణాసి నుంచి అయోధ్యకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
డైవర్షన్ కోసమే వైసీపీ కుట్ర: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
టెక్నాలజీ సాయంతో తుపాన్ నష్టాన్ని తగ్గించాం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News