Spandana Case: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:52 PM
శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థిని స్పందన ఆత్మహత్యకు కారణమైన విద్యార్థిని చెన్నెకొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్ చదువుతున్న స్పందన అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థిని స్పందన(Spandana Case) ఆత్మహత్యకు కారణమైన విద్యార్థిని చెన్నెకొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ విద్యార్థిపై 107బీఎన్ఎస్, 11,12 పోక్సో సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. నిందితుడిగా ఉన్న విద్యార్థి మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కు తరలించారు.
అసలు ఏం జరిగిందంటే...
మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... సత్యసాయి జిల్లా పులేటిపల్లి గ్రామానికి చెందిన అమల, ఆంజనేయులు దంపతుల కుమార్తె స్పందన ధర్మవరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. చెన్నెకొత్తపల్లి మండలం ముష్టికోవేల గ్రామానికి చెందిన ఓ విద్యార్థి ధర్మవరంలోని మరో కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. అయితే, బస్సులో కాలేజీకి వెళ్లివచ్చే క్రమంలో తరుచూ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. వైఖరి మార్చుకోవాలని విద్యార్థిని స్పందన హెచ్చరించింది. దీంతో సదరు విద్యార్థి నానా దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా బస్సులోనే విద్యార్థినిపై దాడి చేశాడు. ధర్మవరంలో బస్సు దిగి కాలేజీకి వెళ్తున్న సందర్భంలోనూ మరోసారి విద్యార్థినిపై దాడి చేశాడు.
దీంతో బాధిత విద్యార్థిని అతడిపై ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. అయితే, ఘటన చెన్నేకొత్తపల్లి పరిధిలో జరిగిందని, అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. దీంతో, బాధిత విద్యార్థిని తన తల్లిదండ్రులతో కలిసి చెన్నెకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. చెన్నెకొత్తపల్లి పోలీసులు కూడా ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. పోలీసుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన స్పందన నవంబరు 26న ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం స్పందనను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారం రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న ఆ విద్యార్థిని మృతి చెందింది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
Bijapur Encounter: బీజాపూర్ ఎన్‌కౌంటర్.. 20కి పెరిగిన మృతుల సంఖ్య..
శ్వాస తీసుకోలేడు.. అన్నం తినలేడు.. ఏడాది గడిచినా దయనీయ స్థితిలోనే శ్రీతేజ్
Read Latest AP News And Telugu News