Share News

Ashes 2025-26: రెండో టెస్ట్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌

ABN , Publish Date - Dec 04 , 2025 | 10:33 AM

యాషెస్‌ సిరీస్‌2025-26లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ బ్రిస్బేన్‌ వేదికగా ఇవాళ(గురువారం) ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

Ashes 2025-26: రెండో టెస్ట్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌
The Ashes 2025

ఇంటర్నెట్ డెస్క్: యాషెస్‌ సిరీస్‌(The Ashes 2025-26)లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ బ్రిస్బేన్‌ వేదికగా ఇవాళ(గురువారం) ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. పెర్త్‌ వేదికగా జరిగిన మొదటి టెస్ట్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌‌లో ట్రావిస్ హెడ్ చెలరేగి ఆడటంతో రెండు రోజుల్లోనే ముగిసింది. ప్రస్తుతం సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ముందంజలో ఉంది. ఎలాగైనా రెండో టెస్ట్‌లో గెలిచి సిరీస్‌ సమం చేయాలని ఇంగ్లాండ్‌ చూస్తోంది. ఈ మ్యాచ్ గెలిచి 2-0 ఆధిక్యంలోకి వెళ్లాలని ఆసీస్ పట్టుదలతో ఉంది.


పింక్‌బాల్‌తో జరిగే డే/నైట్‌ ఈ టెస్టు( England vs Australia 2nd Test)లో ఆతిథ్య ఆస్ట్రేలియానే ఫేవరెట్‌ గా ఉంది. ఆ జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లోనూ స్టీవ్‌ స్మితే సారథ్య బాధ్యతలు వహించనున్నాడు. గాయపడిన ఖవాజా స్థానంలో జోష్‌ ఇంగ్లిష్‌ తుది జట్టులో చేరాడు. అలానే ఇంగ్లాండ్ జట్టులో గాయంతో మ్యాచ్‌కు దూరమైన మార్క్‌‌వుడ్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ చేరాడు.


ఆస్ట్రేలియా తుది జట్టు

జేక్‌ వెదర్‌ల్యాండ్‌, ట్రావిస్‌ హెడ్‌, లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), కామెరూన్‌ గ్రీన్‌, జోష్‌ ఇంగ్లిష్‌, అలెక్స్‌ క్యారీ (వికెట్‌ కీపర్‌), మైఖేల్‌ నెసర్‌, మిచెల్‌ స్టార్క్‌, స్కాట్‌ బోలాండ్‌, బ్రెండన్ డగ్గెట్‌

ఇంగ్లాండ్‌ తుది జట్టు:

జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), జెమీ స్మిత్‌ (వికెట్‌ కీపర్‌), విల్‌ జాక్స్‌, గస్‌ అట్కిన్సన్‌, బ్రైడన్‌ కార్స్‌, జోఫ్రా ఆర్చర్‌

Updated Date - Dec 04 , 2025 | 10:33 AM