AP News: వైసీపీలో తీవ్ర విషాదం.. కీలక నేత కన్నుమూత
ABN , Publish Date - Sep 13 , 2025 | 01:32 PM
వైసీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి(70) మృతి చెందారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలోని పొలంలో పనులు చేయిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కింద పడిపోయారు.
- తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి మృతి
అనంతపురం: వైసీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి(70) మృతి చెందారు. ఆత్మకూరు(Atmakur) మండలం తోపుదుర్తిలోని పొలంలో పనులు చేయిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కింద పడిపోయారు. వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. భాస్కర్‌రెడ్డి(Bhasker Reddy) సుదీర్ఘ కాలం కాంగ్రె్‌సపార్టీలో పనిచేశారు. ఆత్మకూరు మండల ఎంపీపీగా పనిచేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి సతీమణి తోపుదుర్తి కవిత జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.
వైపీసీ ఆవిర్భావం తర్వాత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి దంపతులు ఆ పార్టీలో చేరారు. భాస్కర్‌రెడ్డి మృతదేహాన్ని నగరంలోని రామచంద్రనగర్‌లోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నివాళి అర్పించారు. భాస్కర్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. జడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎంపీ రంగయ్య, గంగుల భానుమతి, మధుసూదన్‌రెడ్డి తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. భాస్కర్‌రెడ్డికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!
Read Latest Telangana News and National News