Share News

Venkataramireddy: జగన్‌ ప్రజల్లో తిరగకూడదనే భద్రత కుదింపు..

ABN , Publish Date - Feb 22 , 2025 | 12:35 PM

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి(YSRCP chief Jaganmohan Reddy)ని ప్రజల్లో తిరగకుండా చేసేందుకే భద్రత కుదించారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి(Anantha Venkataramireddy) ఆరోపించారు.

Venkataramireddy: జగన్‌ ప్రజల్లో తిరగకూడదనే భద్రత కుదింపు..

- వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి(YSRCP chief Jaganmohan Reddy)ని ప్రజల్లో తిరగకుండా చేసేందుకే భద్రత కుదించారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి(Anantha Venkataramireddy) ఆరోపించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chief Minister Chandrababu) కుట్రలు చేస్తున్నారన్నారు. ఇల్లీగల్‌ యాక్టివిటీలకు భద్రత కల్పించలేమని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: వీసాల పేరుతో మోసాలు.. 51 మంది నుంచి రూ.2కోట్లకుపైగా వసూళ్లు


pandu4.3.jpg

రైతులను పరామర్శించటం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్‌ యాక్టివిటీయా..? అని ప్రశ్నించారు. మిర్చి రైతులను జగన్‌ పరామర్శిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు రాజకీయ విలువలు లేవా అని ప్రశ్నించారు. జగన్‌తో ఫొటో దిగిన చిన్నారిపై సోషల్‌ మీడియాలో టీడీపీ సైకోలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. అమ్మ ఒడి వస్తుందో... రాలేదో.. నారాయణ, చైతన్య స్కూళ్ల వద్ద అడిగినా చెబుతారన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం

ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్‌ మాటలు కోటలు దాటుతున్నాయి

ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు నిర్ధారణ!

ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 22 , 2025 | 12:35 PM