వీసాల పేరుతో మోసాలు.. 51 మంది నుంచి రూ.2కోట్లకుపైగా వసూళ్లు
ABN , Publish Date - Feb 22 , 2025 | 12:11 PM
వీసాల పేరుతో రూ.కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ దేశాలకు వెళ్లేందుకు వీసాలు సమకూరుస్తామని నమ్మించి 51మంది నుంచి రూ.2 కోట్లకు పైగా వసూళ్లు చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ దయానంద్(City Police Commissioner Dayanand) పేర్కొన్నారు.
- దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు: వీసాల పేరుతో రూ.కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ దేశాలకు వెళ్లేందుకు వీసాలు సమకూరుస్తామని నమ్మించి 51మంది నుంచి రూ.2 కోట్లకు పైగా వసూళ్లు చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ దయానంద్(City Police Commissioner Dayanand) పేర్కొన్నారు. శుక్రవారం కమిషనరేట్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన జనవరి 24న ఆగ్నేయ సీఈఎన్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Ballari: విషాధం.. భార్యను కడతేర్చి.. భర్త ఆత్మహత్య
సోషల్‌మీడియా ద్వారా వీసాలకోసం సంప్రదించాలని సక్లెన్ సుల్తాన్, నిఖాత్ సుల్తాన్ అనే దంపతులు ప్రచారం చేపట్టారు. ప్రచారానికి స్పందించిన ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షల రూపాయలు తీసుకుని వీసా ఇస్తామని అతన్ని మోసం చేశారు. బాధితుడు పలుమార్లు ఇద్దరు ఏజెంట్ల చుట్టూ తిరిగినా వారు స్పందించలేదు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయ్యింది. ఇలా 33మంది నుంచి 1.78 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు గుర్తించారు. మరో వ్యక్తి ద్వారా 15మందికి సంబంధించిన వీసాలు చేయిస్తామని రూ.86 లక్షలు వివిధ ఖాతాలకు జమ చేయించుకున్నారన్నారు.

సుదీర్ఘంగా విచారణ జరిపాక వీరి నకిలీలు బయటపడ్డాయన్నారు. మొత్తం 51మంది నుంచి 2.64 కోట్ల రూపాయలు నగదు పొందినట్లు గుర్తించామని కమిషనర్ వివరించారు. ఇద్దరినీ అరెస్టు చేసి వారినుంచి 2 కార్లు, 2 బైక్‌లతోపాటు రూ.50లక్షలతో ఓ ఇంటిని లీజుకు తీసుకున్న పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు శ్రీలంక, దుబాయ్, గోవా, ఊటీ, తదితర ప్రాంతాల్లో విలాసాలకే ఎక్కువ ఖర్చు చేసినట్లు తెలిసిందన్నారు. ఆగ్నేయ విభాగం డీసీపీ సారా ఫాతిమా బృందం అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిందన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం
ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి
ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు నిర్ధారణ!
ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు
Read Latest Telangana News and National News