Share News

Rayavaram Fireworks Blast: రాయవరం పేలుడు ఘటనపై విచారణ కమిటీ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 17 , 2025 | 05:29 PM

కోనసీమ జిల్లా రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌ బాణసంచా పరిశ్రమలో పేలుడు ఘటన సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. దీనిపై విచారణ కమిటీ కూడా ఏర్పాటు అయింది. తాజాగా ఈ కమిటీలోని సభ్యులు సురేష్ కీలక కామెంట్స్ చేశారు.

Rayavaram Fireworks Blast: రాయవరం పేలుడు ఘటనపై విచారణ కమిటీ కీలక వ్యాఖ్యలు
Ganapathi Fireworks Accident

కోనసీమ జిల్లా: రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌ బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10మంది మృతిచెందారు. దీనిపై విచారణ కమిటీ (Rayavaram Blast Inquiry) కూడా ఏర్పాటు అయింది. తాజాగా ఈ కమిటీలోని సభ్యులు సురేష్ కీలక కామెంట్స్ చేశారు. రాయవరంలో పేలుడు ఘటనపై విచారణ చేపట్టామని ఆయన తెలిపారు.


శుక్రవారం నాడు కమిటీ సభ్యుడు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. 'బాణసంచా పరిశ్రమ (Rayavaram Explosion)లో పేలుడు ఘటనపై రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపకశాఖ, కార్మిక శాఖ అధికారులను విచారణ చేశాం. పేలుడు సంభవించిన గణపతి గ్రాండ్ పైర్ వర్క్స్ కు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అన్ని అనుమతులు ఉన్నాయి. ప్రమాదం జరిగిన ముందు అంటే గత నెల 26వ తేదీన ఈ బాణసంచా కేంద్రం(Rayavaram Explosion)లో తనిఖీలు జరిగాయి. తనిఖీలు జరిగిన రిపోర్టును పరిశీలించాం. బాణసంచా తయారీ చేసే విషయంలో అన్ని ప్రమాణాలు పాటించారా, లేదా? అనే విషయంపై మాకు అనుమానాలు వస్తున్నాయి. ఈ పేలుడుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికులు రావాల్సి ఉంది.


ఈ ప్రమాదంలో మృతిచెందిన 10మంది.. పేద కుటుంబాలకు చెందిన వారే. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని బాధిత కుటుంబాలు, ప్రజాప్రతినిధులు వినతిపత్రాలు అందజేశారు. ఈ వినతులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం. త్వరలోనే పూర్తి వివరాలు సేకరించి విచారణ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం' అని సురేష్ తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలోని లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్‌(Rayavaram Explosion) తయారీ కేంద్రంలో ఈనెల 8న పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. ఆ తరువాత మృతుల సంఖ్య 10కి చేరింది.


ఈ వార్తలు కూడా చదవండి...

బీసీ బంద్‌కు కవిత మద్దతు

ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

Updated Date - Oct 17 , 2025 | 08:38 PM