MLA: పరిటాల రవికి మరణం లేదు..
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:00 PM
మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు మరణం లేదని, ఆయన ఆశయాలను పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్దార్థ ముందుకు తీసుకువెళుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. పరిటాల రవీంద్ర అందరి గుండెల్లో బతికే ఉన్నారని అన్నారు.
- రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
రామగిరి(అనంతపురం): మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు మరణం లేదని, ఆయన ఆశయాలను పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్దార్థ ముందుకు తీసుకువెళుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత(Raptadu MLA Paritala Sunitha) అన్నారు. పరిటాల రవీంద్ర అందరి గుండెల్లో బతికే ఉన్నారని అన్నారు. రామగిరిలోని టీడీపీ కార్యాలయ ఆవరణలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహాలను శుక్రవారం ఆమె ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. ముందుగా మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, పరిటాల రవి ఆశయాలు ఎంతో గొప్పవని అన్నారు. ఎంతో మంది అన్నదాతలకు అండగా నిలిచారని, పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేశారని, రక్తదానం చేయించారని అన్నారు. ఆయన గురించి కొందరు విమర్శలు చేయడం వారి కుసంస్కారానికి నిదర్శనమని అన్నారు.
కట్టె కాలేవరకూ ఇక్కడే..
పరిటాల రవికి దేవుడిచ్చిన తండ్రి ఎన్టీఆర్ అని పరిటాలశ్రీరామ్ అన్నారు. పరిటాల రవీంద్రను కొండపల్లి సీతారామయ్య, ఎన్టీఆర్ ముందుండి నడిపించారని అన్నారు. ఆయన కుమారుడిగా పుట్టడం గర్వంగా ఉందని అన్నారు. తమ కట్టె కాలేవరకు టీడీపీలోనే పనిచేస్తామని, సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌ల కోసం నిలబడతామని అన్నారు. తండ్రి ప్రేమ తనకు చిన్నతనంలోనే దూరమైందని, కానీ వేలాది మంది అభిమానులను తమ కుటుంబానికి ఆయన అందించారని అన్నారు. తమను ముందుండి నడిపిస్తున్న అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. పరిటాల రవి పిలుపు ఇచ్చిన రక్తదానం నేటికి నిర్విరామంగా కొనసాగుతోందని అన్నారు.

రక్తదాన శిబిరం
పరిటాల రవీంద్ర మెమోరీయల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్టు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, అనంతపురం, హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రుల సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వెయ్యి మందికి పైగా అభిమానులు రక్తదానం చేశారు. రక్త దాతలను పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ, జ్ఞాన, తేజస్విని పలకరించి, జ్ఞాపికలను అందజేశారు. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 980 మందికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, మందులు, కంటి అద్దాలను ఉచితంగా పంపిణీచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి
Read Latest Telangana News and National News