Share News

Vijayawada : వైసీపీ ఉన్మాదుల అకృత్యం

ABN , Publish Date - Feb 10 , 2025 | 04:42 AM

తర్వాత ఓ రాజకీయ నాయకుడి కుమారుడు ఆమెపై అత్యాచారం చేస్తాడు. దీన్ని అతడి స్నేహితులు చూస్తూ చప్పట్టు కొట్టి ప్రోత్సహిస్తారు!!

Vijayawada : వైసీపీ ఉన్మాదుల అకృత్యం

  • ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై ఒకరు అత్యాచారం

  • వీడియోలు చిత్రీకరించామని ఇద్దరు బెదిరింపులు

  • తమ కోరికా తీర్చాలని వేధింపులు

  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు..అదుపులో నిందితులు

విజయవాడ/కంచికచర్ల, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): క్లబ్‌లో గుమస్తాగా పనిచేస్తున్న తండ్రి కోసం వెళ్లిన కుమార్తెను ఆకతాయిలు స్విమ్మింగ్‌పూల్‌లోకి తోసేస్తారు. తర్వాత ఓ రాజకీయ నాయకుడి కుమారుడు ఆమెపై అత్యాచారం చేస్తాడు. దీన్ని అతడి స్నేహితులు చూస్తూ చప్పట్టు కొట్టి ప్రోత్సహిస్తారు!! కొన్నాళ్ల క్రితం విడుదలైన కర్తవ్యం చిత్రంలోనిదీ సన్నివేశం!!. అచ్చం ఇలాగే, ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థినిని ప్రేమ పేరుతో వంచించి ఆమెపై అత్యాచారం చేస్తున్న యువకుడ్ని ప్రోత్సహించారు వైసీపీ యువజన విభాగానికి చెందిన యువకులు. ఈ దృశ్యాలను ఫోన్లలో చిత్రీకరించామని వేధిస్తుండడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్లలో జరిగిందీ దారుణం. తిరువూరుకు చెందిన ఓ యువతి బీటెక్‌ చదువుతోంది. పరిటాల గ్రామానికి చెందిన చింతల ప్రభుకుమార్‌ ఆమెతోపాటు చదువుతున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. పరిటాల గ్రామానికి చెందిన పెయింటర్‌ షేక్‌ గాలి షాహిద్‌ (పిద్దూ), షేక్‌ హుస్సేన్‌(పీసు), ప్రభుకుమార్‌ ఒకే ఊరికి చెందిన వారు కావడంతో వారి మధ్య స్నేహబంధం ఏర్పడింది. వారిలో హుస్సేన్‌ సోషల్‌ మీడియాలో చాలా చురుకుగా ఉంటాడు. రీల్స్‌ చేసి ఇన్‌స్టాలో పోస్టు చేస్తాడు. ఈ ముగ్గురూ వైసీపీ యువజన విభాగానికి చెందినవారు. వారి వాట్సాప్‌ స్టేట్‌సల్లో అన్నీ వైసీపీకి సంబంధించినవే ఉన్నాయి. ప్రభుకుమార్‌తో స్నేహంగా ఉండటంతో హుస్సేన్‌కు కూడా ఆ యువతితో పరిచయం ఏర్పడింది.


ఈ ఏడాది సంక్రాంతి సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో యువతిని హుస్సేన్‌ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడికి షాహిద్‌, ప్రభుకుమార్‌ చేరుకున్నారు. కాసేపటికి హుస్సేన్‌ బయటకు వచ్చేశాడు. తర్వాత షాహిద్‌ లోపలకు వెళ్లి యువతిపై అత్యాచారం చేశాడు. బయట ఉన్న హుస్సేన్‌, ప్రభుకుమార్‌ చప్పట్లు కొడుతూ అతడిని ప్రోత్సహించారు. ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్లలో చిత్రీకరించామని యువతిని బెదిరిస్తున్నారు. తమ కోరికలు కూడా తీర్చకపోతే వీడియోలను వెబ్‌సైట్ల లో అప్‌లోడ్‌ చేస్తామని వేధిస్తున్నారు. ఈ ముగ్గురి నుంచి నిత్యం నరకం అనుభవిస్తున్న బాధితురాలు తల్లిదండ్రుల సాయంతో కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ బి.రాజు ఈ ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని, సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్‌ చెప్పారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 04:45 AM