Political Interference : అమరావతిపై అదే విషం!
ABN , Publish Date - Feb 05 , 2025 | 03:26 AM
రాజధాని నిర్మాణం తొలిదశకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) కలిసి రూ.15,500 కోట్లు రుణమిచ్చేందుకు అంగీకరించాయి.
మళ్లీ ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు
రుణ మంజూరులో సరైన విధానం పాటించలేదని తాజాగా ఆరోపణలు
విచారణ చేపట్టిన ఇన్‌స్పెక్షన్ ప్యానెల్
అన్నీ వివరిస్తున్న టెండర్ల పర్యవేక్షక కమిటీ
అప్పులు పుట్టకుండా 4 నెలలుగా సైంధవుల దుష్ట పన్నాగాలు
వైసీపీ నాయకులే ఇదంతా చేస్తున్నారని ప్రభుత్వం గుర్రు!
మళ్లీ ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
రాజధాని అమరావతిపై విద్వేషం, విషం చిమ్మడం కొనసాగుతున్నాయి. అమరావతి అభివృద్ధికి ప్రపంచబ్యాంకు రుణం రాకుండా సైంధవులు కొందరు దుష్ట పన్నాగాలు పన్నుతున్నారు. రాజధాని నిర్మాణం తొలిదశకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) కలిసి రూ.15,500 కోట్లు రుణమిచ్చేందుకు అంగీకరించాయి. ఇందులో ప్రపంచబ్యాంకు వాటా రూ.6,800 కోట్లు. తొలి వాయిదా నిఽధుల విడుదలకు సర్వం సిద్ధం కావడంతో సీఆర్‌డీఏ పలు పనులకు టెండర్లు కూడా పిలిచింది. ఈ దశలో రాజధాని పనులకు రుణం మంజూరుకు సరైన విధానం అవలంబించలేదంటూ తాజాగా ప్రపంచ బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. వీటిపై ఆ బ్యాంకు ఇన్‌స్పెక్షన్ టీమ్ ప్యానె ల్ పరిశీలన ప్రారంభించింది. దీనివల్లే బ్యాలెన్స్ టెండర్లను పిలవడంలో కొంత జాప్యం నడుస్తోంది. దీనికి తోడు శాసనమండలి ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రావడంతో.. టెండర్ల అంశాన్ని సీఆర్‌డీఏ ఎన్నికల సంఘం (ఈసీ)దృష్టికి తీసుకెళ్లింది. కోడ్‌కు ముందే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీల బంగళాలు, హ్యాపీనెస్ట్, రోడ్ల అభివృద్ధి పనులు, ఎల్‌పీఎస్ ఇన్ర్ఫా వంటి పనులకు సీఆర్‌డీఏ ఇప్పటికే చాలా వరకు టెండర్లు పిలిచింది. అలాగే అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్) కూడా రాజధాని ప్రధాన రోడ్ల నిర్మాణం, అమరావతి వరద విపత్తు ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన కొండవీడు వాగు, గ్రావిటీ కెనాల్, పాలవాగు విస్తరణాభివృద్ధి పనులకు టెండర్ నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటిలో చాలా పనులకు ఈ నెలలోనే టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది. ఈసీ నుంచి వీటికి అభ్యంతరాలు రాకపోవచ్చని ఉన్నతాధికారులు అంటున్నారు.
చంద్రబాబు సీఎం కాగానే..
చంద్రబాబు మళ్లీ సీఎం కాగానే.. రాజధాని నిర్మాణానికి రుణసమీకరణపై దృష్టి సారించారు. దీంతో సైంధవులు రంగంలోకి దిగారు. రుణం ఇవ్వొద్దని ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదులు పంపారు. రైతులు స్వచ్ఛందంగా భూములివ్వలేదని.. బలవంతంగా వారినుంచి లాక్కున్నారని గతంలో చేసిన ఆరోపణలే మళ్లీ చేశారు. దీంతో బ్యాంకు ఉన్నతాధికారులు, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు అమరావతిలో పర్యటించి ఆరాతీశారు. క్షేత్ర స్థాయిలో రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ తర్వాత లోతైన పరిశీలన చేసి కేంద్రప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఏడీబీతో కలిసి 15,500 కోట్ల రుణం ఇవ్వాలని నిర్ణయించింది. అయినా మళ్లీ తాజాగా ఫిర్యాదులు వెళ్లాయి. అమరావతి ప్రకృతి విపత్తులకు కేంద్రబిందువని.. ఇటీవల వరదలు ముంచెత్తాయని ఇంకోసారి ఫిర్యాదు చేశారు. వీటిపైనా ప్రపంచ బ్యాంకు విచారించింది. అమరావతికి శాశ్వత వరద ప్రణాళిక రూపొందిస్తున్నామని సీఆర్‌డీఏ వివరించడంతో సంతృప్తి వ్యక్తం చేసింది. వరద ప్రణాళికల విషయంలో ప్రపంచ బ్యాంకు కూడా అనేక మార్పులను సూచించడం గమనార్హం. ఇప్పుడేమో.. రుణం మంజూరులో తగిన విధానాన్ని పాటించలేదని ఆ బ్యాంకు దేశీయ బృందంపై ఆరోపణలు మొదలుపెట్టారు. దీంతో ప్రపంచబ్యాంకు ఇన్‌స్పెక్షన్ ప్యానెల్ క్షుణ్ణంగా పరిశీలన చేస్తోంది. టెండర్ల పర్యవేక్ష క కమిటీ ఒక్కో టెండర్‌కు ఎన్ని కొర్రీలు వేసింది.. ఎంత పకడ్బందీగా నిబంధనల రూపకల్పన జరిగింది వంటివాటిని సాక్ష్యాలతో వివరిస్తుండడంతో తాజా ఆరోపణలు వీగిపోవడం ఖాయమని ప్రభు త్వ వర్గాలు విశ్వసిస్తున్నాయి.
విద్వేష ఫిర్యాదుల వెనుక వైసీపీ నేతలున్నారని.. వారే ఈ పనులు చేయిస్తున్నారని సర్కారు ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిని ఏ విధం గా విధ్వంసం చేశారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా దానిపై వారికి ద్వేషం పోలేదు. జగన్ రోతపత్రికలో రాజధానిపై విషం చిమ్మడం పతాకస్థాయికి చేరింది. అమరావతి టెండర్లలో ఘోరాలు, గోల్‌మాల్ జరిగిపోతున్నాయంటూ అసత్య వార్తలను రాస్తోంది. ఇటీవల రాజధానిలో ప్రధాన రోడ్లు, మౌలిక వసతుల పనులకు కలిపి టెండర్లు పిలిస్తే.. భారీగా అంచనాలు పెంచేసి వేర్వేరుగా టెండర్లు పిలిచినట్లు తప్పుడు కథనం రాసింది. ఇలాంటి వార్తలతో ప్రజలను, ప్రపంచ బ్యాంకును తప్పుదారి పట్టించాలన్నది వైసీపీ వ్యూహంగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా యి. అమరావతి నిర్మాణం ముందుకు సాగకుండా చేయడమే వారి దురుద్దేశమని అంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం
శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News