Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ..
ABN , Publish Date - Sep 28 , 2025 | 03:27 PM
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జ్వరంతోనే ఇటీవల ఏపీ అసెంబ్లీ వెళ్లారు. అలాగే తన శాఖలపై సమీక్షలు చేశారు. అనంతరం వైద్య సహాయం తీసుకున్నారు. అయినా..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. ఆయనతో మాట్లాడి.. ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. పవన్‌కు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ఐదు రోజులుగా పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం.
అలాగే, తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జ్వరంతోనే ఇటీవల ఏపీ అసెంబ్లీ వెళ్లారు. అలాగే తన శాఖలపైనా సమీక్షలు చేశారు. అనంతరం వైద్యులను కలిసి చికిత్స తీసుకున్నారు. అయినా.. జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకా జ్వరంతోనే ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలో పవన్‌ని పరామర్శించడానికి సీఎం చంద్రబాబు ఆయన నివాసానికి చేరుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కరూర్ విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..
విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలు ఇవేనా..?