Heavy Rains: మళ్లీ మూడు రోజుల పాటు వర్షాలు..
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:16 PM
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరాలు, వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ప్రాంతాలలో కొనసాగుతోందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి నాగభూషణం వెల్లడించారు.
విశాఖపట్నం, ఆగస్టు 15: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరాలు, వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ప్రాంతాలలో కొనసాగుతోందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి నాగభూషణం వెల్లడించారు. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పారు.
ఈ నేపథ్యంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. అలాగే కోస్తా తీర ప్రాంతంలోని అన్ని ప్రధాన పోర్టులలో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇప్పటికే జారీ చేశారని వివరించారు. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దంటూ మత్స్యకారులకు సూచించారు.
భారీ వర్షాలు, వరదలు కారణంగా.. రాష్ట్రంలో దాదాపుగా నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో నీరు గరిష్టానికి చేరింది. దీంతో ఆ నీటిని దిగువకు వదిలారు. ఈ నేపథ్యంలో ఆ నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. మరో వైపు భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. ఆ క్రమంలో జిల్లా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..
For Mora AP News And Telugu News