Kakani: మాజీ మంత్రి కాకాణి కోసం పోలీసులు గాలింపు
ABN , Publish Date - May 17 , 2025 | 09:02 AM
Kakani: క్వార్జ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కాకుండా రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూర్‌లో నెల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకాణి బంధువుల ఇళ్లు, ఫాంహౌజ్‌లలో గాలిస్తున్నారు. మరోవైపు క్వార్జ్ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్వార్జ్ కేసులో మాజీ మంత్రి కాకాణి ఏ4గా ఉన్నారు.
నెల్లూరు: వైసీపీ నేత (ycp Leader), మాజీ మంత్రి (Ex Minister) కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) కోసం పోలీసులు (Police) గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎస్పీ కృష్ణకాంత్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుని రంగంలోకి దించారు. కాకాణి కోసం బెంగుళూరు (Bengaluru), హైదరాబాదు (Hyderabad)తో పాటు పలు ప్రాంతాల్లో పది బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సుప్రీం కోర్టు (Supreme Court) ముందస్తు బెయిల్ పిటీషన్ డిస్మిస్ (Bail Petition Dismissed) చేయడంతో కాకాణికి అరెస్ట్ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. కోర్టులో లొంగిపోతారంటూ చర్చలు జరిగాయి. ఈ క్రమంలో పోలీసులు శరవేగంగా ఆధారాలు సేకరించి కోర్టుకి అందించారు. పోలీసుల నోటీసులు నిందితులు తీసుకోలేదు. పైగా సాక్షులపై కాకాణి తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసుల విచారణకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న కాకాణి. రెండు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నారు.
క్వార్జ్ కేసులో కాకాణి ఏ4
క్వార్జ్ కేసులో కాకాణి పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో పోలీసులు కాకాణి బంధువుల ఇళ్లు, ఫాంహౌజ్‌లలో గాలిస్తున్నారు. మరోవైపు క్వార్జ్ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్వార్జ్ కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి గతంలో హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందే ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో పోలీసుల నోటీసులు తీసుకోకుండా.. విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. హైదరాబాద్‌లో కొద్ది రోజులు, బెంగళూర్‌లో కొన్నాళ్లు ఉంటూ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం. నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో రెండు పోలీసు బృందాలు బెంగళూరులో పెద్ద ఎత్తున్న విస్తృతంగా జల్లెడపడుతున్నాయి. రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారికి సంబంధించిన ఇళ్లల్లోనే కొంతకాలం తలదాచుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. బెంగళూరులోని కాకాణి స్నేహితులు, బంధువులకు సంబంధించిన ఇళ్లు, ఫాంహౌజ్‌లు, గెస్ట్‌హౌజ్‌లలో కూడా పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: రీశాట్-1బీ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం
ఏ క్షణమైనా కాకాణి అరెస్టు...
మరోవైపు హైదరాబాద్‌లో కూడా కాకాణి కోసం రెండు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ సాగిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రజ అనే మహిళ అకౌంట్‌లోకి భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించారు. ఆమె ఇంటికి కూడా పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె నోటీసులు తీసుకోకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అలాగే ఈ కేసులో 12 మందిని పోలీసులు గుర్తించారు. అందులో కాకాణి అల్లుడు కూడా ఉన్నారు. వీరందరికీ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా.. వారు లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులు అంటించి వస్తున్నారు. రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చాక వారు స్పందించకపోతే వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్వార్జ్ కేసు విచారణ చాలా వేగవంతంగా సాగుతోంది. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో పోలీసులు బృందాలు యాక్టివ్‌గా పనిచేస్తూ గతంలో కంటే కూడా గాలింపును ముమ్మరం చేశాయి. ఏ క్షణమైనా కాకాణి గోవర్ధన్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో కదలిక
For More AP News and Telugu News