Share News

MP Vemireddy Prabhakar Reddy: ఏపీకి అంతర్జాతీయ సంస్థలు... ఎంపీ వేమిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 21 , 2025 | 08:45 PM

MP Vemireddy Prabhakar Reddy: ఏపీకి అంతర్జాతీయ సంస్థలు రాబోతున్నాయని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

MP Vemireddy Prabhakar Reddy: ఏపీకి అంతర్జాతీయ సంస్థలు... ఎంపీ వేమిరెడ్డి కీలక వ్యాఖ్యలు
MP Vemireddy Prabhakar Reddy

నెల్లూరు జిల్లా: ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడమే తమ లక్ష్యమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాకు రాబోతున్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు దగదర్తి మండలం. దామవరం వద్ద ఎయిర్ పోర్టు భూములను ఇవాళ(శుక్రవారం) ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం పరిశీలించారు. భూములు కోల్పోతున్న రైతులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే కావ్యా క్రిష్ణారెడ్డి భరోసా ఇచ్చారు.


ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగువారు కావడంతోనే ఎయిర్ పోర్టు పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. రామ్మోహన్ చొరవతో ఒక్కరోజు వ్యవధిలో అధికారులను ఢిల్లీ నుంచి ఏపీకి పంపారని అన్నారు. INDOSEL, BPCL సహా చాలా కంపెనీలు నెల్లూరు వైపు అడుగులు వేస్తున్నాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.


యువతకు ఉద్యోగాలు: ఎమ్మెల్యే కావ్యా క్రిష్ణారెడ్డి

ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే కావ్యా క్రిష్ణారెడ్డి తెలిపారు. కృష్ణపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు అనుసంధానం చేస్తూ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం కానుందని అన్నారు. ఎయిర్ పోర్టుకు గతంలో సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తే, వైసీపీ పాలనలో ఒక్క అడుగు ముందుకు కూడా పడలేదని చెప్పారు. 700 ఎకరాల భూసేకరణ పూర్తయిందని.. . మిగిలిన భూసేకరణ కూడా త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కావ్యా క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Minister Kollu Ravindra: జగన్ డ్రామాలను ప్రజలు ఛీకొడుతున్నారు.. మంత్రి కొల్లు రవీంద్ర విసుర్లు

Viveka Case: వివేకా హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ

Vamshi Case: మళ్లీ సమయం కోరిన పోలీసులు.. వంశీ న్యాయవాదుల అభ్యంతరం

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 21 , 2025 | 09:13 PM