Share News

Police Hunt For Kakani: కాకాణి కోసం ముమ్మరంగా గాలింపు.. దాదాపు రెండు నెలలుగా

ABN , Publish Date - May 15 , 2025 | 04:59 PM

Police Hunt For Kakani: రెండు నెలలుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు మాజీ మంత్రి కాకాణి. హైదరాబాద్, బెంగళూరులో కాకాణి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Police Hunt For Kakani: కాకాణి కోసం ముమ్మరంగా గాలింపు.. దాదాపు రెండు నెలలుగా
Police Hunt For Kakani Goverdhan Reddy

నెల్లూరు, మే 15: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Former Minister Kakani Goverdhan Reddy) కోసం పోలీసులు గాలిస్తున్నారు. క్వార్జ్ కేసులో రెండు నెలలుగా కాకాణి తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూర్‌లో నెల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకాణి బంధువుల ఇళ్లు, ఫాంహౌజ్‌లలో గాలిస్తున్నారు. మరోవైపు క్వార్జ్ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్వార్జ్ కేసులో మాజీ మంత్రి కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి గతంలో హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందే ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.


దాంతో రెండు నెలలుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు మాజీ మంత్రి. హైదరాబాద్‌‌లో కొద్దిరోజులు, బెంగళూర్‌లో కొన్నాళ్లు ఉంటూ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. కనీసం ఇంట్లో వాళ్లకు కూడా వాట్స్‌ప్ కాల్‌ మాట్లాడనట్లు సమాచారం. నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో రెండు పోలీసు బృందాలు బెంగళూరులో పెద్ద ఎత్తున్న విస్తృతంగా జల్లెడపడుతున్నాయి. రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారికి సంబంధించిన ఇళ్లల్లోనే కొంతకాలం వరకు తలదాచుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. బెంగళూరులోని కాకాణి స్నేహితులు, బంధువులకు సంబంధించిన ఇళ్లు, ఫాంహౌజ్‌లు, గెస్ట్‌హౌజ్‌లలో కూడా పోలీసులు జల్లెపడుతున్నారు. కాకాణి కోసం గాలింపు ముమ్మరం చేశారు.


మరోవైపు హైదరాబాద్‌లో కూడా రెండు పోలీసు బృందాలు కాకాణి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ సాగిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రజ అనే మహిళ అకౌంట్‌లోకి భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్స్‌ జరిగినట్లు గుర్తించారు. ఆమె ఇంటికి కూడా పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె నోటీసులు తీసుకోకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అలాగే ఈ కేసులో 12 మందిని పోలీసులు గుర్తించారు. అందులో కాకాణి అల్లుడు కూడా ఉన్నారు. వీరందరికీ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా.. వారు లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులు అంటించి వస్తున్నారు. రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చాక వారు స్పందించకపోతే వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్వార్జ్ కేసు విచారణ చాలా వేగవంతంగా సాగుతోంది. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో పోలీసులు బృందాలు యాక్టివ్‌గా పనిచేస్తూ గతంలో కంటే కూడా గాలింపును ముమ్మరం చేశాయి. ఏ క్షణమైనా కాకాణి గోవర్ధన్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


ఇవి కూడా చదవండి

Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... ముగ్గురు ఉగ్రవాదులు హతం

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2025 | 04:59 PM