Share News

Social Media: ఉపముఖ్యమంత్రిపై అనుచిత పోస్ట్.. కేసు నమోదు

ABN , Publish Date - Feb 21 , 2025 | 10:47 AM

Pawan Kalyan: సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టుపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టుపై కావలి రెండో పట్టణం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

Social Media: ఉపముఖ్యమంత్రిపై అనుచిత పోస్ట్.. కేసు నమోదు
Deputy CM Pawan Kalyan

నెల్లూరు, ఫిబ్రవరి 21: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై (Deputy CM Pawan Kalyan) అనుచిత పోస్ట్ తీవ్ర కలకలం రేపుతోంది. హర్షవర్ధన్ రెడ్డి అనే ఎక్స్‌ ఖాతాలో ఉపముఖ్యమంత్రిపై పోస్టు పెట్టారు. ఇటీవల మహాకుంభమేళాలో సతీమణితో కలిసి పవన్ పుణ్యస్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే. పవన్ పుణ్య స్నానం చేస్తున్న ఫోటోకు మరో సినీ నటుడితో పోలుస్తూ సామాజిక మాద్యమంలో పోస్ట్ పెట్టడం రచ్చకు దారి తీసింది. మహా కుంభమేళాలో పుణ్య స్నానం చేస్తున్న పవన్ కళ్యాణ్ చిత్రాన్ని మరో సినీ నటుడు సంపూర్ణేష్ బాబుతో పోలుస్తూ harsha reddy @Harsha 88889x సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో పోస్ట్ అయ్యింది.


దీనిపై జనసేన నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌పై ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై జనసేన నాయకుడు రిషికేష్ పోలీసులను ఆశ్రయించారు. రిషికేష్ ఫిర్యాదుతో కావలి రెండో పట్టణం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉపముఖ్యమంత్రిని కించపరుస్తూ ఇలా అనుచిత పోస్టు పెట్టడం పట్ల కూటమి నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.

తాజ్‌ బంజారా హోటల్‌‌కు షాక్


pawan-kumbhmela.jpg

కాగా.. ఈనెల 18న మహాకుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ పుణ్యస్నానాలు చేశారు. భార్య అనా కొణిదెల, కుమారుడు అకిరానందన్‌, సినీ దర్శకుడు త్రివిక్రమ్‌, టీటీడీ సభ్యుడు ఆనంద సాయితో మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసి త్రివేణి సంగమానికి హారతులిచ్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..‘‘భారతీయులంతా విభిన్నమైన జాతులు, తెగలు, సంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ సనాతన ధ ర్మం విషయంలో మాత్రం ఏకమవుతారు. సనాతన ధర్మం ఇలాగే భవిష్యత్తులోనూ పరిఢవిల్లాలి. ప్రపంచంలో ఇలాంటి మహా కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదు. మహాకుంభమేళాలో జరిగిన కొన్ని ఘటనలు దురదృష్టకరం. సనాతన ధర్మాన్ని నమ్మే, పాటించే వారిపై ఇలాంటి సమయంలో కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడటం బాధ్యతారాహిత్యమే. మహాకుంభమేళా నిర్వహణలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పని చేస్తోంది. సనాతన ధర్మం నమ్మే వారి మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడడం మంచిది కాదు’’ పవన్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

తాజ్‌ బంజారా హోటల్‌‌కు షాక్

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసు.. వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 21 , 2025 | 11:32 AM