Nara Lokesh: వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది
ABN , Publish Date - Aug 12 , 2025 | 08:45 PM
పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు.
అమరావతి, ఆగస్ట్ 12: పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ప్రశంసించారు.
ఈ సందర్భంగా పులివెందుల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం... అంతేకానీ భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదని వైసీపీ అగ్రనాయకత్వానికి మంత్రి నారా లోకేష్ చురకలంటించారు.
ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ముగిసింది. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా మిగిలిన చోట్ల ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. అయితే సాయంత్రం 5.00 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల అధికారులు కల్పించారు.
ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు.. టీడీపీ, వైసీపీ మధ్యే నెలకొంది. పులివెందుల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డ లతా రెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి.. అలాగే ఒంటిమిట్టలో టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగం రెడ్డి బరిలో నిలిచారు. ఇక ఈ ఉప ఎన్నికల పోలింగ్ కోసం పులివెందుల్లో 15, ఒంటిమిట్టలో 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల తుది ఫలితాలు ఆగస్ట్ 14వ తేదీ అంటే గురువారం వెలువడనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. 31 నామినేటెడ్ పోస్టులు భర్తీ
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
For More AndhraPradesh News And Telugu News