Share News

MLA Paritala Sunitha: ఎమ్మెల్యే పరిటాల సునీత వార్నింగ్.. నిర్లక్ష్యంపై చర్యలు తప్పవ్‌

ABN , Publish Date - Oct 23 , 2025 | 01:13 PM

విస్తృతస్థాయి సమవేశానికి పూర్తి సమాచారంతో కాకుండా నిర్లక్ష్యంగా వస్తే చర్యలు తప్పవని కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి పరిధిలోని సొసైటీల సీఈఓలు, బ్యాంకుల అధికారులు, ఉద్యోగులపై ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Paritala Sunitha: ఎమ్మెల్యే పరిటాల సునీత వార్నింగ్.. నిర్లక్ష్యంపై చర్యలు తప్పవ్‌

- పీఏసీఎస్ అధికారులపై ఎమ్మెల్యే పరిటాల సునీత అసంతృప్తి

అనంతపురం: విస్తృతస్థాయి సమవేశానికి పూర్తి సమాచారంతో కాకుండా నిర్లక్ష్యంగా వస్తే చర్యలు తప్పవని కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి పరిధిలోని సొసైటీల సీఈఓలు, బ్యాంకుల అధికారులు, ఉద్యోగులపై ఎమ్మెల్యే పరిటాల సునీత(MLA Paritala Sunitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. మండలంలోని ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని పీఏసీఎస్‏ల పాలకవర్గం, సంఘం సిబ్బంది, ఏడీసీసీ బ్యాంకు మేనేజర్లు, సూపర్‌వైజర్ల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.


సమావేశానికి ఎమ్మెల్యే పరిటాల సునీత, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్‌ ముంటిమడుగు కేశవరెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ నెట్టెం వెంకటేష్‌ హాజరయ్యారు. సొసైటీల సీఈఓలు తమ పరిధిలోని రైతులు, రుణాలు, ఇతరత్రా వాటి గురించి తెలియజేశారు. ఇందులో కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లికి సంబంధించిన అధికారులు సరైన వివరాలు వెల్లడించకపోవడం పట్ల ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు కూడా అధికారులు నిబంధనలు అంటూ అడ్డు చెబుతున్నారని పలువురు సొసైటీల చైర్మన్లు ప్రస్తావించారు.


pandu1.3.jpg

వైసీపీ హయాంలో అక్రమంగా ఇచ్చిన రుణాలపై విచారణ చేయాలన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడీసీసీ బ్యాంకు చైర్మన్‌ ముట్టిమండుగు కేశవరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో అనువుగాని చోట గోదాములు కట్టారన్నారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికే వాటిని నిర్మించారన్నారు. అవన్నీ బ్యాంకులకు భారంగా మారాయన్నారు. కొండగుట్టల్లో కడితే వాటిని ఎలా వినియోగించుకోవాలో అర్థంకావట్లేదన్నారు. త్వరలోనే వన్‌టైం సెటిల్‌మెంట్‌ అమలు చేస్తామన్నారు.


pandu1.22.jpg

కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంకు సీఈఓ సురేఖ, డీజీఎం రాంప్రసాద్‌, రాప్తాడు నియోజకవర్గంలోని సింగిల్‌ విండో అధ్యక్షులు లక్ష్మీనారాయణ, పామురాయి రఘు, కృష్ణమోహన్‌ చౌదరి, నరసింహులు, నెట్టెం వెంకటేశ్వర్లు, ముత్యాలు, గోపాల్‌, లింగన్న, బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్లు జింకా సూర్యనారాయణ, కొండప్ప, శ్రీనివాసులు, ముత్యాలురెడ్డి, సీనియర్‌ నాయకులు రామ్మూర్తినాయుడు, సుధాకర్‌నాయుడు, రంగయ్య, దండు ఓబులేసు, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..

మావోయిస్టు మద్దతుదారులపై నజర్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 23 , 2025 | 01:13 PM