Share News

Polavaram Project: పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు

ABN , Publish Date - Oct 06 , 2025 | 02:46 PM

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు,

Polavaram Project: పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు
Polavaram Project

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ అధికారులు భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష జరుగనుంది. సమావేశానికి ముందు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన నిమ్మల.. పోలవరం ఏపీకి వరమని, రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చే ప్రాజెక్టని పేర్కొన్నారు. పోలవరం 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 72 శాతం పూర్తయ్యిందన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు వెనక్కి నెట్టబడిందని పేర్కొన్నారు. జగన్ పాలనలో పోలవరం విధ్వంసం అయ్యిందన్నారు మంత్రి నిమ్మల. డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అయ్యిందన్నారు. గత పాలనలో పోలవరం ప్రశ్నార్థకమైపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యం కాదు అనే విధంగా జగన్ వ్యవహరించారని మంత్రి నిమ్మల దుయ్యబట్టారు. సాక్షాత్తు జగన్ అసెంబ్లీలో పోలవరం గురించి చేసిన వ్యాఖ్యలు చూశామన్నారు.


Auto Driver Scheme AP

2023లో ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో పోలవరం ప్రాజెక్టుని పట్టాలెక్కించి ఒక టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నామని మంత్రి నిమ్మల చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఫిజికల్‌గా మూడుసార్లు సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు గతంలో రూ.850 కోట్లు ఇచ్చామని మంత్రి వివరించారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రూ. 900 కోట్లు ఇచ్చామని తెలిపారు.


Also Read:

అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..

గిన్నెలు కడిగేటప్పుడు ఈ 5 తప్పులు చేయకండి..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Oct 06 , 2025 | 03:48 PM