Dishwashing Tips: గిన్నెలు కడిగేటప్పుడు ఈ 5 తప్పులు చేయకండి..
ABN , Publish Date - Oct 06 , 2025 | 02:41 PM
వంట పాత్రలను శుభ్రం చేయడం చాలా కష్టం. ఎందుకంటే, వాటి మురికి అంత త్వరగా పోదు. అయితే, గిన్నెలు కడిగేటప్పుడు ఈ 5 తప్పులు చేయకండి..
ఇంటర్నెట్ డెస్క్: వంట పాత్రలను శుభ్రం చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాటికి నూనె, జిడ్డు మరకలు అంటుకుని ఉంటాయి. వీటిని క్లీన్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. చాలా మంది ఆ జిడ్డు మరకలు తొలగించడానికి కొన్ని పద్ధతులను ఉపయోగిస్తారు. అయితే, గిన్నెలు కడిగేటప్పుడు ఈ 5 తప్పులు చేయకుండా ఉండండి.
వేడి నీటిని ఉపయోగించడం
మీరు పాత్రలు కడగడానికి వేడి నీటిని ఉపయోగిస్తుంటే, ఈ అలవాటును వెంటనే మార్చుకోండి. ఎందుకంటే, వేడి నీరు పాత్రల నుండి జిడ్డును తొలగించగలిగినప్పటికీ, అది మీ చేతుల చర్మాన్ని కూడా దెబ్బతీస్తుంది.

ఎక్కువగా సబ్బు వాడటం
చాలా మంది మహిళలు గిన్నెలు శుభ్రం చేసేటప్పుడు ఎక్కువగా సబ్బును ఉపయోగిస్తారు, ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే, ఎక్కువగా సబ్బును వాడటం వల్ల గిన్నెలపై సబ్బు మరకలు అలానే ఉండిపోతాయి. ఆ పాత్రలను తిరిగి ఉపయోగించినప్పుడు అవి సబ్బు వాసన వస్తాయి.
శుభ్రమైన స్పాంజ్ వాడకపోవడం
మీరు పాత్రలను శుభ్రం చేసినప్పుడల్లా, శుభ్రమైన స్పాంజ్‌ని ఉపయోగించండి. అలా చేయకపోతే పాత్రలకు ఉన్న మురికి అలానే ఉంటుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

కిచెన్ సింక్ శుభ్రం చేయకపోవడం
పాత్రలను శుభ్రం చేసిన తర్వాత, కిచెన్ సింక్‌ను కూడా పూర్తిగా శుభ్రం చేయాలి. అలా చేయకపోతే వ్యర్థాలు కుళ్ళిపోయి, దుర్వాసన వస్తుందని, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని గమనించండి.
పాత్రలను ఆరనివ్వకుండా పెట్టడం
కడిగిన తర్వాత పాత్రలను ఎప్పుడూ నేరుగా కబోర్డ్స్ లో ఉంచడం మంచి కాదు. అవి ఆరడానికి సమయం ఇవ్వాలి. తడి పాత్రలను కబోర్డ్స్‌లో ఉంచితే, అవి దుర్వాసన వస్తాయి.
Also Read:
ఈ దేశాలలో పర్యాటకులపై ఆంక్షలు.. ఎందుకో తెలుసా?
59 ఏళ్ల వయసులో ప్రేమ.. 2 కోట్లు మోసపోయిన టీచరమ్మ..
For more Latest News