Share News

Woman Victim Of Romance Scam: 59 ఏళ్ల వయసులో ప్రేమ.. 2 కోట్లు మోసపోయిన టీచరమ్మ..

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:07 PM

ఆహాన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ప్రతీ రోజూ వాట్సాప్ ద్వారా ఇద్దరూ మాట్లాడుకునే వారు. త్వరలో ఇండియాకు వచ్చేస్తానని అనేవాడు. 2020 నుంచి ఏదో ఒక కారణం చెప్పి ఆమెను డబ్బులు అడుగుతూ వచ్చాడు.

Woman Victim Of Romance Scam:  59 ఏళ్ల వయసులో ప్రేమ.. 2 కోట్లు మోసపోయిన టీచరమ్మ..
Woman Victim Of Romance Scam

లేటు వయసులో ప్రేమ ఓ రిటైర్డ్ టీచరమ్మ కొంప ముంచింది. ఆన్‌లైన్ ప్రియుడు ఆమెను నిండా ముంచేశాడు. నమ్మించి కోట్ల రూపాయలు కాజేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన 59 ఏళ్ల రిటైర్డ్ టీచర్ భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. ప్రస్తుతం ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఈ నేపథ్యంలోనే నాలుగేళ్ల క్రితం ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంది.


2019లో ఓ మాట్రిమోనియల్ సైట్‌లో తన పేరును రిజిస్ట్రర్ చేయించుకుంది. అదే సంవత్సరం డిసెంబర్ నెలలో ఆహాన్ కుమార్ పరిచయం అయ్యాడు. తాను ఓ ఎన్ఆర్ఐని అంటూ పరిచయం చేసుకున్నాడు. అట్లాంటాలోని ఓ ఇజ్రాయెల్ ఆయిల్ కంపెనీలో డ్రిల్లింగ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నానని చెప్పాడు. ఓ ఐడీ కార్డు కూడా చూపించాడు. దానిపై అతడి ఫోటో లేకపోయినా ఆమెకు అనుమానం రాలేదు. అతడితో స్నేహం చేసింది.


ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆహాన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ప్రతీ రోజూ వాట్సాప్ ద్వారా ఇద్దరూ మాట్లాడుకునే వారు. త్వరలో ఇండియాకు వచ్చేస్తానని అనేవాడు. 2020 నుంచి ఏదో ఒక కారణం చెప్పి ఆమెను డబ్బులు అడుగుతూ వచ్చాడు. పాపం అతడి మాయలో పడి లక్షల రూపాయలు అతడికి పంపించింది. 2024 వరకు దాదాపు 2.3 కోట్లు పంపింది. ఏడాది గడిచినా అతడు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. మోసపోయానని గుర్తించిన టీచరమ్మ పోలీసులను ఆశ్రయించింది. అతడిపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

నేడు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

నగరంలో ఏం జరుగుతోంది.. ఒకే సారి ఎండ, వాన

Updated Date - Oct 06 , 2025 | 12:18 PM