Bihar Assembly Poll Schedule: నేడు బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Oct 06 , 2025 | 10:05 AM
2020లో అసెంబ్లీ ఎన్నికలు బిహార్ వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగాయి. మొత్తం 243 స్థానాలకు గాను నవంబర్ 22 వరకు ఎన్నికలు జరిగాయి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నేడు (సోమవారం) షెడ్యూల్ ఖరారు చేయనుంది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ప్రెస్ మీట్‌లో ఎన్నికల తేదీలు ప్రకటించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు తక్కువ విడతల్లో జరిగే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం బిహార్‌లో పర్యటించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరిగే విడతలపై పలు రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల సంఘానికి పలు విజ్ఞప్తులు చేశారు.
ఎన్డీఏ కూటమి ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వాలని కోరింది. ప్రతిపక్ష పార్టీలు రెండు విడతల్లో ఎన్నికలు జరగాలని కోరాయి. అయితే, ఛత్ పండుగ మొదలైన వెంటనే ఎన్నికలు జరగాలని అధికార, ప్రతిపక్ష వర్గాలు స్పష్టం చేశాయి. అక్టోబర్ 25వ తేదీన ఛత్ పండుగ మొదలవ్వనుంది. వారి విజ్ణప్తులను దృష్టిలో పెట్టుకుని తక్కువ విడతల్లో ఎన్నికలు ముగించాలన్న నిర్ణయానికి ఈసీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సారి తక్కువ విడతల్లో ఎన్నికలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈసీ దృష్టి సారించింది.
భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని భావిస్తోంది. పెద్ద మొత్తంలో బలగాలను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తోంది. తక్కువ విడతల్లో ఎన్నికలు ముగించాలంటే.. ఎక్కువ మొత్తంలో పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పోలింగ్ బూత్‌ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకే పెద్ద మొత్తంలో బలగాలను సిద్ధం చేయాలని చూస్తోంది. కాగా, 2020లో అసెంబ్లీ ఎన్నికలు బిహార్ వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగాయి. మొత్తం 243 స్థానాలకు గాను నవంబర్ 22 వరకు ఎన్నికలు జరిగాయి.
ఇవి కూడా చదవండి
తల్లిని పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు.. సీసీటీవీలో రికార్డైన వీడియో చూస్తే..
నగరంలో ఏం జరుగుతోంది.. ఒకే సారి ఎండ, వాన