Boy saves mother: తల్లిని పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు.. సీసీటీవీలో రికార్డైన వీడియో చూస్తే..
ABN , Publish Date - Oct 06 , 2025 | 09:35 AM
సాధారణంగా చిన్న పిల్లలకు ప్రమాదాల గురించి పెద్దగా తెలియదు. ఏది సురక్షితమో, ఏది ప్రమాదమో అనే విషయంలో అవగాహన ఉండదు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మూడేళ్ల కుర్రాడు మాత్రం చాలా వేగంగా ఆలోచించి తన తల్లిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడు.
సాధారణంగా చిన్న పిల్లలకు ప్రమాదాల గురించి పెద్దగా తెలియదు. ఏది సురక్షితమో, ఏది ప్రమాదమో అనే విషయంలో అవగాహన ఉండదు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మూడేళ్ల కుర్రాడు మాత్రం చాలా వేగంగా ఆలోచించి తన తల్లిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడు. ఆ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (3-year-old saves mom).
@imdazamalam అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ తన మూడేళ్ల కొడుకుతో రోడ్డు పక్కన నిలబడి ఉంది. ఆమె బహుశా ఆటో కోసం వేచి చూస్తున్నట్టు ఉంది. వారి పక్కనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. ఆ కుర్రాడు ఒకసారి ఆ ట్రాన్స్‌ఫార్మర్ వైపు చూసి తన తల్లిని పక్కకు లాగేశాడు. తల్లి పక్కకు జరుగుతున్న సమయంలో అక్కడ మంటలు చెలరేగాయి. ఆ మహిళ అంతకు ముందు నిల్చున్న చోటే ఓ విద్యుత్ తీగ తెగి పడిపోయింది. అది 11,000 వోల్ట్‌ల హైటెన్షన్ విద్యుత్ తీగ కావడంతో భారీగా మంటలు చెలరేగాయి (high-tension wire accident).
ఆ విద్యుత్ తీగ ఆ మహిళకు తగిలి ఉంటే ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలి ఉండేది. ఆ పిల్లవాడు తన తల్లి ప్రాణాలను కాపాడాడు (shocking rescue video). ఆ ఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటన బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో జరిగింది. వేల మంది ఈ వీడియోను వీక్షించారు. ఆ వీడియోలో కుర్రాడిపై చాలా మంది ప్రశంసలు కురిపించారు.
ఇవి కూడా చదవండి..
ఈ వాచ్‌మెన్ కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడంటే.. స్ఫూర్తివంతమైన స్టోరీ..
మీ సమర్థతకు పరీక్ష.. 78ల మధ్యనున్న 87ను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..