Narendra Modi Birthday 2025: లండన్‌లో మోదీ కోసం మంత్రి లోకేశ్ ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:55 PM
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) బిజినెస్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ దేశానికి రైట్ టైమ్‌లో రైట్ లీడర్‌గా అయ్యారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా భారత్ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
మోదీ బర్త్ డే సందర్భంగా లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. లండన్‌లోని ఇస్కాన్ ఆలయంలో మోదీ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీకి దీర్ఘాయుష్షు కలగాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే, మోదీ మార్గదర్శకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకం ఉందని మంత్రి లోకేశ్ తన సోషల్ మీడియాలో తెలిపారు.
Also Read:
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ
విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సదస్సు
For More Latest News