Minister Nara Lokesh : కంసమామ మోసం.. చంద్రన్న న్యాయం
ABN , Publish Date - Jan 12 , 2025 | 04:50 AM
విద్యార్థుల ఫీజుల విషయంలో కంసమామ(జగన్) మోసం చేసి పోతే, చంద్రన్న సాయం చేస్తున్నారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.

జగన్ ఫీజు బకాయిలపై మంత్రి లోకేశ్ ట్వీట్
రూ.788 కోట్లు చెల్లించనున్నట్లు వెల్లడి
అమరావతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఫీజుల విషయంలో కంసమామ(జగన్) మోసం చేసి పోతే, చంద్రన్న సాయం చేస్తున్నారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. జగన్‌రెడ్డి ఫీజులు బకాయిల పెట్టి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారన్నారు. ఆయన పెట్టిన బకాయిలు ప్రజా ప్రభుత్వం తీర్చాలని రోడ్డెక్కిన ఘనత కూడా జగన్‌కే దక్కుతుందన్నారు. విద్యార్థులకు ఫీజుల విడుదలపై శనివారం ఆయన ఎక్స్ ద్వారా స్పందించారు. గత పాలకులు చేసిన పాపాలకు విద్యార్థులు బలి కాకూడదన్న ఉద్దేశంతో తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కాలేజీల యాజయాన్యాలతో చర్చలు జరిపి, సర్టిఫికెట్లు ఆపకుండా చూశామని పేర్కొన్నారు. దశలవారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చామని, అందులో భాగంగానే ఇప్పుడు రూ.788 కోట్లు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పండుగ వేళ విద్యార్థులకు తీపి కబురు చెప్పిన సీఎం చంద్రబాబుకు కతజ్ఞతలు తెలిపారు.