Share News

Minister Dola : పీఎంఏజీవై నిధులను పెంచండి

ABN , Publish Date - Feb 09 , 2025 | 03:21 AM

ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన శాఖా సంబంధమైన నిధులు విడుదల చేయాలి’ అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విజ్ఞప్తి చేశారు.

Minister Dola : పీఎంఏజీవై నిధులను పెంచండి

  • సంక్షేమ వసతి గృహాలకు నిధులు విడుదల చేయాలి: డోలా

  • ఢిల్లీలో పీఎంఏజేఏవై పథకంపై సమన్వయ సమావేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ‘పీఎం ఆదర్శ గ్రామ్‌ యోజన(పీఎంఏజీవై) కింద కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న రూ.20 లక్షలను రూ.50 లక్షలకు పెంచాలి. దీనితోపాటు ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన శాఖా సంబంధమైన నిధులు విడుదల చేయాలి’ అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి అనుసూచిత్‌ జాతి అభ్యుదయ్‌ యోజన(పీఎం-ఏజీఏవై)కు సంబంధించిన సమన్వయ సమావేశం ఢిల్లీలో శనివారం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి డోలా హాజరయ్యారు. సమావేశంలో మంత్రి డోలా మాట్లాడుతూ... ‘సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం షెడ్యూల్‌ వర్గాల ప్రజలకు సంక్షేమం అందించే దిశగా ముందుకు వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు రావలసిన నిధులు విడుదల చేయాలి’ అని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. మంత్రులు వీరేంద్ర కుమార్‌, సహాయ మంత్రి రామ్‌దాస్‌ అథవాలేతో మంత్రి డోలా సమావేశమై నిధుల విడుదలపై చర్చించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..

Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..

Updated Date - Feb 09 , 2025 | 03:21 AM